ETV Bharat / bharat

వందేభారత్​ మిషన్: 17 దేశాలకు 170 విమానాలు

కరోనా సంక్షోభ సమయంలో చిక్కుకున్న వారిని తమ స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వందేభారత్​ మిషన్​ నాలుగో దశ త్వరలో ప్రారంభం కానుంది. వచ్చే నెల 5 నుంచి 17వ తేదీ వరకు చేపట్టబోయే ఈ కార్యక్రమంలో 170 ప్రత్యేక విమానాలను విదేశాలకు పంపనుంది ఎయిరిండియా.

Vande Bharat Mission phase 4: AI to operate 170 flights to and from 17 countries between July 3-15
వందే భారత్​ మిషన్​ 4వ దశ: 17 దేశాలకు 170 విమానాలు
author img

By

Published : Jun 28, 2020, 3:06 PM IST

వందే భారత్​ మిషన్​ నాలుగో దశను జులై 5 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది కేంద్రం. ఇందులో భాగంగా 170 ఎయిరిండియా ప్రత్యేక విమానాలను 17 దేశాలకు పంపనున్నట్లు ప్రకటించింది.

విమానాలు పంపించే దేశాలివే..

నాలుగో దశ మిషన్​లో భాగంగా కెనడా, అమెరికా, బ్రిటన్, కెన్యా, శ్రీలంక, ఫిలిప్పీన్స్​, కిర్గిస్థాన్​, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్​, థాయ్​లాండ్​, దక్షిణాఫ్రికా, రష్యా, ఆస్ట్రేలియా, మయన్మార్, జపాన్​, ఉక్రెయిన్​, వియత్నాం దేశాలకు ఎయిరిండియా విమానాలను పంపనున్నట్లు తెలిపింది. ఇందులో ఇండో- యూకే మార్గం ద్వారా 38 విమానాలు, ఇండో- యూఎస్​ మార్గంలో 32 విమానాలను నడపనున్నారు. సౌదీ అరేబియాకు 26 విమానాలు తమ సేవలను అందించనున్నాయి.

కరోనా కారణంగా మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సేవలను రద్దు చేసిన ప్రభుత్వం.. లాక్​డౌన్​తో చిక్కుకుపోయిన వారిని తమ స్వస్థలాలకు తరలించేందుకు మే 6 న వందే భారత్​ మిషన్​ను ప్రారంభించింది.

జూన్​ 10న ప్రారంభమైన 3వ దశలో వివిధ దేశాలకు 495 ప్రత్యేక విమానాలను నడుపుతోంది ఎయిరిండియా. ఈ మిషన్​ వచ్చే నెల 4న ముగియనుంది.

ఇదీ చదవండి: వందే భారత్​ మిషన్: స్వదేశానికి 3.6 లక్షల మంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.