హాయ్, మీరు ఒక అరటిపండుపై పరిశోధన చేయాలని అనుకున్నారనుకుందాం! కానీ మీ దగ్గర రకరకాల పళ్లతో కలిపి చేసిన పళ్లరసం మాత్రమే అందుబాటులో ఉంటే అరటిపండు గురించి పరిశోధించాలంటే ఏం చేస్తారు? ఇలాంటి సమస్యేశాస్త్రవేత్తలకు 'శరీర కణాల' పరిశోధనలో ఎదురవుతోంది.
మన శరీరంలో అనేక రకాల కణాలుంటాయి. కనుక ఇటీవల కాలం వరకు చాలా అధిక కణజాల నమూనాలను శాస్త్రవేత్తలు విశ్లేషించాల్సి వచ్చేది. అయినప్పటికీ కేవలం కొద్దిపాటి ఫలితాలను మాత్రమే పొందగలిగేవారు.
అయితే ఇటీవల అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో కొత్త ప్రయోగ పద్ధతిలో పరిశోధకులు ఒకే సమయంలో వేలకొద్దీ కణాలను విశ్లేషించి, వాటిని వర్గీకరించగలుగుతున్నారు. దీన్ని అనుసరించి పళ్ల రసం నుంచి పండ్లను పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ ఏక కణ విశ్లేషణ మన శరీర జీవ సంబంధ నిర్మాణాల గురించి అనేక ఆవిష్కరణలు చేయడానికి అవకాశం కల్పించిందని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ ఆవిష్కరణ కాన్సర్ కణాలు ఎలా వృద్ధి చెందుతున్నాయో తెలుసుకోవడానికి, జన్యు పరివర్తన నమూనాలు పరిశీలించడానికి సహకరిస్తుంది.
దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు శరీరంలోని అన్ని రకాల కణాలతో ఒక అట్లాసు తయారుచేయాలని ప్రయత్నిస్తున్నారు. అంటే సుమారు 10 బిలియన్ కణాల ప్రొఫైల్స్ రూపొందించాలని భావిస్తున్నారు. ఫలితంగా వ్యాధులకు సరైన చికిత్స అందించడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.