ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని టాండీ ఫతేపురి సమీపంలో వేగంగా దూసుకెళుతున్న లారీ.. కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందగానే హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మౌరానీపుర్ ఆసుపత్రికి తరలించారు.
సీఎం దిగ్భ్రాంతి
ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు పూర్తి వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఝాన్సీ కలెక్టర్‌ను ఆదేశించారు.
ఇదీ చూడండి: ఆన్లైన్ గేమ్ కోసం 78లక్షలు అప్పు- ఓటమితో ఆత్మహత్య