ETV Bharat / briefs

భారత్​లో 112కు చేరిన కరోనా కేసులు!

భారత్​లో కరోనా కేసుల సంఖ్య 112కు చేరినట్టు తెలుస్తోంది. తాజాగా కేరళలో రెండు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్​లో ఒక్కో కేసు నమోదైంది. బాధితులకు ప్రత్యేక శిబిరంలో వైద్యం అందిస్తున్నట్లు ఆయా రాష్ట్రాల అధికారులు వెల్లడించారు.

Uttarakhand reports first coronavirus case
భారత్​లో 112కు చేరిన కరోనా కేసులు!
author img

By

Published : Mar 15, 2020, 10:08 PM IST

Updated : Mar 16, 2020, 7:06 AM IST

దేశంలో కరోనా వైరస్​ వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్​లో ఆదివారం కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 112కు చేరినట్టు సమాచారం.

కర్ణాటకలో..

కర్ణాటకలో తాజాగా ఓ మహిళకు కరోనా పాజిటివ్​గా తేలింది. కలబురిగి జిల్లా ఆస్పత్రిలో ఆమెకు వైద్యం అందిస్తున్నారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7కు చేరింది. ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా.. ఐదుగురు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కేరళలో..

కేరళలో మరో రెండు కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ ప్రకటించారు. ఒకరు బ్రిటన్​ దేశీయుడు కాగా మరొకరు ఓ వైద్యుడిగా గుర్తించారు. వారు విదేశాల నుంచి వచ్చినట్లు తెలిపారు మంత్రి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది.

మహారాష్ట్రలో..

మహారాష్ట్ర పుణెలో కొత్తగా ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. ఆ వ్యక్తి జపాన్​ నుంచి పుణెకు వచ్చినట్లు గుర్తించారు అధికారులు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 32కు చేరుకుంది.

ఉత్తరాఖండ్​లో తొలి కేసు..

ఉత్తరాఖండ్​లో తొలి కరోనా కేసు నమోదైంది. అటవీ శాఖకు చెందిన శిక్షణ అధికారికి కరోనా పాజిటివ్​గా తేలినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఆ వ్యక్తి ఇటీవలే స్పెయిన్​ నుంచి వచ్చినట్లు గుర్తించారు అధికారులు. మొత్తం 25 నమూనాలను పరీక్షలకు పంపగా.. 17 నెగటివ్​గా వచ్చినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...

Last Updated : Mar 16, 2020, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.