ETV Bharat / bharat

బహిరంగ చర్చకు ఉత్తరాఖండ్ మంత్రి డుమ్మా - madan kaushik

దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సవాలు చేసిన బహిరంగ చర్చకు ఉత్తరాఖండ్ మంత్రి మదన్​ కౌశిక్ గైర్హాజరయ్యారు. అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టే చర్చకు హాజరు కాలేదని సిసోడియా వ్యాఖ్యానించారు.

manish sisodia, madan kaushik
సిసోడియా సవాల్
author img

By

Published : Jan 4, 2021, 10:16 PM IST

దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సవాల్ చేసిన బహిరంగ చర్చకు ఉత్తరాఖండ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మదన్​ కౌశిక్ హాజరుకాలేదు. దెహ్రాదూన్​లోని ఐఆర్​డీటీ ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిసోడియా మాత్రమే హాజరయ్యారు. అభివృద్ధికి పాటుపడలేదు కాబట్టే కౌశిక్ చర్చకు గైర్హాజరయ్యారని సిసోడియా అన్నారు.

"ఉత్తరాఖండ్​లో భాజపా నాలుగేళ్ల పాలనలో అవినీతి తప్ప ఏం జరగలేదు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులేవీ జరగట్లేదని మంత్రి గైర్హాజరుతో స్పష్టమవుతోంది. ఏదో ఒక రోజు నేతలందరూ ఇలా బహిరంగంగానే చర్చించుకుంటారని ఆశిస్తున్నా. అది ప్రజాస్వామ్యానికి మంచిది"

-మనీష్ సిసోడియా, దిల్లీ ఉపముఖ్యమంత్రి

ఇదీ సంగతి..

కొద్ది రోజుల క్రితం ఉత్తరాఖండ్, దిల్లీ ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు సిసోడియా కౌశిక్​కు సవాల్​ విసిరారు. సవాలుని స్వీకరిస్తున్నట్టు కౌశిక్ సిసోడియాకు ఆదివారం లేఖ రాశారు. కానీ చర్చకు రాకపోవచ్చని లేఖలో సూచనప్రాయంగా పేర్కొన్నారు. రాజకీయాలు థియేటర్లలో ఆడే ఆటలు కాదంటూ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి : 'మోదీజీ... నేతాజీ రహస్య పత్రాల సంగతేంటి?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.