ETV Bharat / bharat

ఆ రాష్ట్రానికి ఇక 2 రాజధానులు- సీఎం కీలక ప్రకటన

ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి వేసవి కాల రాజధానిగా గైర్​సైణ్​ను ప్రకటించారు.

uttarakhand cm announces summer capital
ఆ రాష్ట్రానికి ఇక 2 రాజధానులు- సీఎం కీలక ప్రకటన
author img

By

Published : Mar 4, 2020, 7:09 PM IST

Updated : Mar 4, 2020, 7:34 PM IST

ఉత్తారాఖండ్​ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చమోలి జిల్లా గైర్​సైణ్​ను వేసవి కాల రాజధానిగా ఎంపిక చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. దెహ్రాదూన్​ రాజధానిగా యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

గైర్​సైణ్​లో నిర్వహించిన బడ్జెట్ సమావేశాల్లోనే రెండో రాజధానిపై ప్రకటన చేశారు రావత్​.

3 దశాబ్దాలుగా డిమాండ్లు...

1990లలో ఉత్తరాఖండ్​ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడే కొండ ప్రాంతమైన గైర్​సైణ్​ను రాజధానిగా చేయాలన్న డిమాండ్లు బలంగా వినిపించాయి. కానీ ఆ విషయంపై రాజకీయ పార్టీలు ఎప్పుడూ ఎలాంటి హామీ ఇవ్వలేదు. శాసనసభ సమావేశాలు మాత్రం అప్పుడప్పుడు గైర్​సైణ్​లో జరుగుతూ ఉంటాయి. రావత్ తాజా నిర్ణయంతో అక్కడి​ ప్రజల డిమాండ్ పాక్షికంగా నెరవేరినట్టయింది.

ఇదీ చూడండి:కరోనా కలవరం... భారత్​లో ఇప్పటివరకు 28 కేసులు

Last Updated : Mar 4, 2020, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.