అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేశాడు చిన్నార్ యాదవ్ అనే కిరాతకుడు. శిరచ్ఛేదం చేసి తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందాలో ఈ ఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం నిందితుడు చిన్నార్ యాదవ్.. స్థానిక నేతా నగర్లో తన భార్య(35)తో కలిసి నివాసం ఉంటున్నాడు. ఉదయం 7.30 గంటలకు ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. తగువులాట తీవ్రం కావడం వల్ల కోపంతో పదునైన ఆయుధంతో భార్య తలను తెగనరికేశాడు. తలను బాబెరూ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి లొంగిపోయాడు.

తన భార్య తలను పట్టుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిందని పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి- చెప్పుకోలేక.. ఆపుకోలేక ఇబ్బంది పడుతున్నారా?