ETV Bharat / bharat

ఔరా.. హస్తకళ! అరచేతిలో అదిరే ఆహారం

లాక్​డౌన్​తో అనేకమంది ఇళ్లకే పరిమితమై చాలా విసుగు చెందుతున్నారు. కానీ అహ్మదాబాద్​కు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త తనలోని ప్రతిభను బయట పెట్టేందుకు ఇదే మంచి సమయం అని భావించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అరచేతిలో అదిరే వంటకాలను సిద్ధం చేసేస్తోంది. చూస్తే నోరూరే ఆ వంటకాలు నిజం కాదని చెప్తే కచ్చితంగా షాక్​ అవ్వాల్సిందే! ఇంతకీ ఆమె వాటిని ఎలా చేస్తోందో తెలుసా..

author img

By

Published : Apr 20, 2020, 1:01 PM IST

Utilisation of Lockdown: Business woman designs miniature food craft
ఔరా..హస్తకళ! అరచేతిలో అదిరే ఆహారం

లాక్​డౌన్ వల్ల ఇంట్లో ఉండటానికి చాలా మంది విసుగు చెందుతున్నారు. మరికొందరు మాత్రం తమలోని ప్రతిభను బయటకు తీసేందుకు ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నారు. కొత్త కొత్త వంటకాలు నేర్చుకోవడంలో కొందరు నిమగ్నమైతే, మరి కొందరు ఇంటి అలంకరణ, మొక్కల పెంపకం, వ్యాయామం వంటి రకరకాల పనుల్లో నిమగ్నమవుతున్నారు. అహ్మదాబాద్​కు చెందిన ఓ మహిళా వ్యాపారి.. అరచేతిలో పట్టేలా రకరకాల ఆహార నమూనాలను సిద్ధం చేసేస్తోంది. వాటిని చూస్తే నిజంగా అరచేతిలో ఆహారం పట్టేసిందే అనిపిస్తోంది! ఇంతకీ వాటిని ఎలా చేస్తోందో చూసేద్దామా?

ఆరగించేయాలి అనిపించేలా..

లాక్​డౌన్​ను పాటిస్తూ అహ్మదాబాద్​లో చాలా మంది తమ అభిరుచిని అనుసరిస్తున్నారు. తమకు నచ్చిన వంటకాలు చేస్తూ, రానివి నేర్చుకుంటూ, యోగా, ధ్యానం వంటి కార్యకలాపాలతో బిజీగా గడుపుతున్నారు. అయితే నగరంలోని వ్యాపారవేత్త శ్వేతా షా మాత్రం లాక్​డౌన్​లో చిన్న సైజు ఆహార పదార్థాల నమూనాలను రూపొందిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. వాటిని చూస్తే నిజమైన ఆహారమే అని భావించి ఆరగించేయాలి అనిపించడం ఖాయం.

ఒక్కో డిజైన్​కు 30 నుంచి 45 నిమిషాలు

శ్వేతా షా ఈ సూక్ష్మ ఆహార పదార్థాల నమూనాల తయారీలో ఒక్కో ఆకృతిని తీర్చిదిద్దేందుకు 30 నుంచి 45 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఇక రంగులు వేయడానికి మరో 15 నిమిషాలు పడుతుంది. ఆమె తయారు చేసే ప్రతి వస్తువు రెండున్నర అంగుళాల పరిమాణం లేదా రూపాయి నాణాల పరిమాణంలో ఉంటాయి.

ఎన్నో వెరైటీలు

శ్వేతా షా ఇలా చాలా వెరైటీలు చేసేస్తోంది. అన్నం, కూర, పప్పు, అప్పడాలు, స్వీట్లు, కూరగాయలు, మిర్చి, స్నాక్స్​, పకోడి ఇలా రకరకాల నమూనాలు తయారు చేస్తోంది.

"వ్యాపారంలో నిమగ్నమై హస్తకళకు ప్రాధాన్యం ఇవ్వలేకపోయా. ఇప్పుడు లాక్​డౌన్​ వల్ల నాకు చాలా సమయం దొరికింది. అందుకే రకరకాల సూక్ష్మ ఆహార పదార్థాల నమూనాలను తీర్చిదిద్దుతున్నా. ఇప్పటికే స్నాక్స్​, స్వీట్లు, పప్పు వంటి రకాలను తయారు చేశా. ఆవిష్కరణ, సృజనాత్మకత నాలోని ప్రత్యేకత. లాక్​డౌన్ వల్ల మళ్లీ నాలోని హస్తకళ బయటకు తీసే అవకాశం వచ్చింది. పప్పు, అన్నం, భజియా వంటి పదార్థాలు చేయమని నా కుటుంబ సభ్యులు సూచించారు."

-- శ్వేతా షా , వ్యాపారవేత్త.

తయారీకి ఇవే ముఖ్యం

ఈ చిన్న చిన్న ఆహార పదార్థాల నమూనాలు తయారు చేసేందుకు ఉపయోగించే ముడి పదార్థం కోసం మొక్కజొన్న పిండి,ఫెవికోల్​ను ఉపయోగించింది షా. ఇక వాటినే ఆహార పదార్థాలుగా తయారు చేస్తోంది. వీటితోనే కప్పులు, స్పూన్లు, ప్లేట్లు కూడా చేస్తుంది. అయితే ఇలా చేసేటప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉండాలి.

ఇదీ చదవండి: 'రైళ్లు, విమాన సేవలపై ఆ వార్తలు నమ్మొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.