ఉత్తర్‌ప్రదేశ్ షాజహాన్‌పుర్‌లో దారుణం జరిగింది. నిద్రిస్తున్న తల్లిపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేశాడో కిరాతక కుమారుడు. తీవ్రగాయాలపాలైన ఆమె.. చికిత్స పొందుతూ మరణించింది.
అసలేం జరిగిందంటే.?
కొంతకాలంగా రత్నా దేవి(58), ఆమె కుమారుడు ఆకాశ్ గుప్తా గొడవ పడుతున్నారు. ఎలాగైనా తల్లిని చంపాలనుకున్న ఆకాశ్... భార్య, బంధువులతో కలిసి కుట్ర పన్నాడు. సోమవారం తెల్లవారుజామున రత్నా దేవి నిద్రిస్తున్న సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసి, నిప్పంటించాడు.
రత్నా దేవి కేకలు విన్న పొరుగువారు.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర గాయాలపాలైన ఆమె.. చికిత్స పొందుతూ మృతిచెందింది.
నిందితులు ఆకాశ్ గుప్తా సహా.. అతడి బంధువులు అచెలాల్, వినోద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: ఉరివేసుకుని ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య