వారంతా స్థానికంగా జరిగిన ఓ పండుగకు హాజరై సంతోషంగా ట్రాక్టర్లో ఇంటికి తిరుగుపయనమయ్యారు. అనుకోని రూపంలో వారిలో కొందరిని మృత్యువు కబళించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయీలో ఈ ఘటన జరిగింది.
కత్రా-బిల్హౌర్ జాతీయ రహదారి వద్ద ఎదురుగా వచ్చిన ట్రక్కు... ట్రాక్టర్‌ను ఢీకొంది. ఘటనలో ఆరుగురు మరణించారు. అదే ట్రాక్టర్‌లోని మరో 30 మందికిపైగా తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.