ETV Bharat / bharat

'మా బిడ్డ మేజర్​ శ్వేతాను చూస్తుంటే గర్వంగా ఉంది'

author img

By

Published : Aug 19, 2020, 10:53 PM IST

తమ ముద్దు బిడ్డ మేజర్​ శ్వేతా పాండేను చూస్తే ఎంతో గర్వంగా ఉందంటూ ఉత్తర్​ప్రదేశ్​ వాసులు సంబరాలు జరుపుకుంటున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగురవేస్తున్న సమయంలో ఆయనకు సహాయంగా నిలిచారు మేజర్​ శ్వేతా. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి రాజ్​​ రతన్​ పాండే.. ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

UP takes pride in its daughter Major Shweta Pandey, had helped PM Modi in flag hoisting
'మా బిడ్డ మేజర్​ శ్వేతాను చూస్తుంటే గర్వంగా ఉంది'

స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేస్తున్నప్పుడు ఆయనకు సహాయంగా నిలిచిన మహిళా అధికారి మేజర్​ శ్వేతా పాండేకు సొంత రాష్ట్రం ఉత్తర్​ప్రదేశ్​ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తమ బిడ్డ శ్వేతాపై గర్వంగా ఉందని లఖ్​నవూ ప్రజలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో శ్వేతా తండ్రి రాజ్​​ రతన్​ పాండే.. 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడారు. తన కుమార్తె మోదీకి సహయం చేయడమే కాకుండా.. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన విక్టరీ డే పరేడ్​లో మూడు రక్షణ దళాలకు నేతృత్వం వహించినట్టు పేర్కొన్నారు. అక్కడ శ్వేతా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినట్టు గర్వంగా చెప్పారు.

ఆర్మీ నిబంధనల కారణంగా మీడియాతో మాట్లాడటానికి మేజర్​ శ్వేతా పాండే విముఖత వ్యక్తం చేశారు. అయితే.. ప్రధాని వద్ద ఫ్లాగ్​ ఆఫీసర్​గా ఉండటం ఎంతో గౌరవంగా, సంతృప్తికరంగా ఉన్నట్టు వెల్లడించారు.

మేజర్​ శ్వేతా పాండే తండ్రి రాజ్​​ రతన్​ పాండే .. ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ అదనపు డైరెక్టర్​గా విధులు నిర్వర్తించారు. ఆమె తల్లి అమితా పాండే సంస్కృతం, హిందీ ప్రొఫెసర్​.

సైన్యంలోని 505 బేస్​ వర్క్​షాప్​ సైనిక అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు శ్వేతా పాండే. ఆయుధాలు, యుద్ధ వాహనాలు, ఇతర ఆయుధ సంపత్తికి అవసరమైన మరమ్మతులు చేసే పనులను పర్యవేక్షిస్తుంటారు. ఆ విభాగంలో ఈఎంఈ (ఎలక్ట్రానిక్స్​ అండ్​ మెకానికల్​ ఇంజనీర్స్​) ఆఫీసర్​ ఆమె.

ఇదీ చూడండి:- ఐక్యతా విగ్రహానికి రక్షణగా సీ​ఐఎస్ఎఫ్​ సిబ్బంది​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.