ETV Bharat / bharat

'ఎఫ్​ఐర్​ నమోదు చేయాలంటే డాన్స్​ చేయాల్సిందే' - ఉత్తర్​ప్రదేశ్​ నేర వార్తలు

తనకు జరిగిన వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ఓ బాలిక పోలీస్​ స్టేషన్​కు వెళ్లి.. కేసు నమోదు చేయమని అభ్యర్థించింది. అయితే ఎఫ్​ఐఆర్​ ఫైల్​ చేయాలంటే తన ముందు ఆ బాలిక డాన్స్​ చేయాలని పోలీస్​ ఇన్​స్పెక్టర్ కోరినట్లు ఆ బాలిక ఆరోపించింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. ఆమె తీసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

UP Police officer asks girl to dance before filing FIR
నా ముందు డాన్స్​ చేస్తేనే ఎఫ్​ఐఆర్​ నమోదు చేస్తా
author img

By

Published : Aug 16, 2020, 6:48 PM IST

న్యాయం కోరుతూ పోలీస్​ స్టేషన్​కు వెళ్లిన ఓ 16ఏళ్ల బాలికకు చేదు అనుభవం ఎదురైంది. తన ముందు డాన్స్​ చేస్తేనే ఎఫ్​ఐఆర్​ నమోదు చేసుకుంటానని ఆ పోలీసు చెప్పడం ఆమెను షాక్​కు గురిచేసింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

ఏం జరిగిందంటే.?

గోవింద్​నగర్​లోని పశ్చిమ దబౌలీ ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో 16 ఏళ్ల బాలిక తన కుటుంబంతో నివాసముంటోంది. వివిధ ప్రాంతాల్లో భజన కార్యక్రమాలు చేస్తూ వారు జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల ఇంటి యజమాని మేనల్లుడు ఆ బాలికను వేధిస్తున్నాడని ఆ కుటుంబీకులు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే వారిని బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాడా యజమాని.

ఇదిలా ఉండగా ఆ ఇంటి యజమాని మేనల్లుడు అనూప్​ యాదవ్​.. జులై 26న తమ ఇంట్లోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డాడని ఆమె తల్లి ఆరోపించింది. ఈ నెల 7న రాత్రి సమయంలో మార్కెట్​ నుంచి ఇంటికి వస్తున్న మార్గంలో తన కుమార్తెను అత్యాచారం చేశాడని ఆమె పేర్కొంది. ఈ విషయమై నిందితుడిపై ఫిర్యాదు చేసేందుకు స్థానిక గోవింద్​నగర్​ పోలీసు స్టేషన్​కు వెళ్లారు.

ఆ తర్వాత పోలీస్​ ఇన్​స్పెక్టర్​ అనురాగ్​ మిశ్రా తనను మళ్లీ పిలిచినట్టు బాలిక తెలిపింది. తన ముందు డాన్స్​ చేస్తేనే ఎఫ్​ఐఆర్​ నమోదు చేసుకుంటానని ఇన్​స్పెక్టర్​ చెపినట్టు ఆరోపిస్తూ ఓ వీడియోను రూపొందించింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఈ పూర్తి వ్యవహారంపై గోవింద్​ నగర్​ సర్కిల్​ ఆఫీసర్​ వికాశ్​ కుమార్​ స్పందించారు. ఇల్లు విషయంలో ఇరువర్గాల మధ్య ముందే వివాదముందని వెల్లండించారు. అయితే పోలీసులపై ఒత్తిడి పెంచేందుకే ఆ బాలికి ఆ విధంగా వీడియో తీసినట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. పూర్తి వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందన్నారు.

ఇదీ చదవండి: పార్లమెంటు సమావేశాలు ఈసారి సరికొత్తగా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.