బలవంతపు మత మార్పిడిలకు వ్యతిరేకంగా ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమోదముద్ర వేశారు. యోగి ఆదిథ్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్ నవంబర్ 24న ఈ ఆర్డినెన్సును ఆమోదించింది.
ఈ ఆర్డినెన్స్ అమలులోకి వస్తే బలవంతంగా మత మార్పిడిలకు పాల్పడేవారికి 10ఏళ్ల వరకు జైలు శిక్ష పడనుంది. మత మార్పిడి కోసమే వివాహం చేసుకున్నట్లైతే.. ఆ వివాహాన్ని చెల్లుబాటుకానిదిగా పరిగణిస్తారు.
ఇటీవలి కాలంలో భాజపా పాలిత రాష్ట్రాలైన ఉత్తర్ప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ తరహా ఆర్డినెన్సులు తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. ప్రేమ, పెళ్లి పేరిట హిందు మహిళలను బలవంతంగా ఇస్లాం మతంలోకి మారేలా చేస్తున్నారని, వాటిని అరికట్టేందుకు ఈ ఆర్డినెన్సులు ఉపయోగపడతాయని చెబుతున్నాయి. ఈ బలవంతపు మత మార్పిడులనే 'లవ్ జిహాద్'గా అభివర్ణిస్తున్నాయి.
ఇవీ చదవండి-