ఉత్తర్‌ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ-బహుజన్ సమాజ్ పార్టీల కూటమి కోసం ఏడు స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెట్టబోమని ప్రకటించింది.
మాయావతి సహా ఆ కూటమిలోని ముఖ్య నేతలు బరిలో దిగే ఏడు స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయబోదని స్పష్టం చేశారు యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్.
"సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీల కోసం కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాలను వదులుకుంటోంది. మాయవతి ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆ స్థానంలో కాంగ్రెస్ పోటీ చేయదు." -రాజ్ బబ్బర్, ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.
ఆ ఏడు స్థానాల్లో మైన్‌పురి, కన్నౌజ్, ఫిరోజాబాద్లు ఉన్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు మరిన్ని ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్టు రాజ్ బబ్బర్ తెలిపారు. రెండు స్థానాలను అప్నాదళ్‌కు ఇవ్వనున్నట్టు చెప్పారు.