ETV Bharat / bharat

అయోధ్య రామాలయం పనులపై యోగి సమీక్ష

అయోధ్యలో రామ్​లల్లా అలయాన్ని సందర్శించారు ఉత్తరప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్య నాథ్​. పూజల అనంతరం ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు.

UP CM offers prayers at Ayodhya's Ram Lalla Temple, reviews development works
అయోధ్య రాముని ఆలయ పనులను సమీక్షించిన యోగి ఆదిత్యనాథ్​
author img

By

Published : Feb 7, 2021, 3:26 PM IST

అయోధ్యలోని రామ్​ లల్లా ఆలయాన్ని ఉత్తరప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ సందర్శించి పూజలు చేశారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు.

భజన్​ సంధ్యా స్థల్​, క్వీన్​ మెమోరియల్​ పార్క్​, రామ్​ కథా పార్క్​ సుందరీకరణ పనులను పరిశీలించారు యోగి. రహదారులు, పార్కింగ్​ స్థలాలు, బస్​ స్టేషన్​, రైల్వే స్టేషన్​ పునరుద్ధరణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సోలార్​ సిటీగా అయోధ్య..

అయోధ్యను సౌర​ నగరంగా తీర్చిదిద్దనున్నట్లు ప్రభుత్వ యంత్రాంగం వెల్లడించింది. ఆధ్యాత్మిక, పౌరాణిక, చారిత్రక దృశ్యాలతో కూడిన '84 కోసి పరిక్రమ' అయోధ్య నగరానికి మరింత అందాన్ని తెచ్చిపెడుతుందని తెలిపింది.

అయోధ్య నగర అభివృద్ధికి ప్రపంచస్థాయి కన్సల్టెంట్​ను ప్రభుత్వం నియమించనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: బంగాల్​ బరి​: 'సరస్వతీ' మంత్రం పఠిస్తున్న తృణమూల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.