భారత్ భారీ దౌత్య విజయాన్ని సాధించింది. జైషే మహ్మద్ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు, కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. ఇంత కాలం అడ్డుతగిలిన చైనా వైఖరి మార్చుకొని అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు లేవనెత్తిన అభ్యంతరాలను వెనక్కి తీసుకుంది.
మసూర్ అజార్ ఆస్తులను ఐరాస స్తంభింపజేయనుంది. అలాగే విదేశాలకు వెళ్లడాన్ని నిషేధించనుంది.
-
Big,small, all join together.
— Syed Akbaruddin (@AkbaruddinIndia) May 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Masood Azhar designated as a terrorist in @UN Sanctions list
Grateful to all for their support. 🙏🏽#Zerotolerance4Terrorism
">Big,small, all join together.
— Syed Akbaruddin (@AkbaruddinIndia) May 1, 2019
Masood Azhar designated as a terrorist in @UN Sanctions list
Grateful to all for their support. 🙏🏽#Zerotolerance4TerrorismBig,small, all join together.
— Syed Akbaruddin (@AkbaruddinIndia) May 1, 2019
Masood Azhar designated as a terrorist in @UN Sanctions list
Grateful to all for their support. 🙏🏽#Zerotolerance4Terrorism
అడ్డుతొలగిన చైనా
మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస గుర్తించకుండా ఇప్పటివరకు నాలుగుసార్లు చైనా అడ్డుపడింది. ఈ ఏడాది మార్చిలోనూ అజార్‌పై ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ ప్రవేశపెట్టిన ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మొత్తానికి భారత్ సహా అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల ఒత్తిడికి తలొగ్గింది డ్రాగన్ దేశం. అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చేందుకు తెలిపిన అభ్యంతరాలను వెనక్కి తీసుకుంది. మసూద్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.
ముంబయిలో ఉగ్రదాడి, పుల్వామా ఉగ్ర ఘాతుకానికి పాల్పడింది జైషే మహ్మద్ సంస్థే. అప్పటి నుంచి మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించేందుకు భారత్ ఎంతో కృషి చేసింది. చాలా దేశాలతో చర్చలు జరిపింది. చివరకు విజయం సాధించింది.