కారాగారాల్లో ఖైదీల అసహజ మరణాలు 2015తో పోల్చితే 2016లో రెట్టింపయ్యాయి. 2015లో 115 మంది మరణించగా, 2016లో ఈ సంఖ్య 231కి చేరింది. అంటే 100.87 శాతం మరణాలు ఎక్కువయ్యాయి. జాతీయ నేర రికార్డుల బ్యూరో 'ప్రిజన్ స్టేటస్టిక్స్ ఇండియా 2016' పేరుతో నివేదిక విడుదల చేసింది.
మొదటి స్థానంలో యూపీ
ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 231 మందిలో 102 మంది ఖైదీలు ఆత్మహత్య చేసుకున్నారు. 14 మంది ఇతర ఖైదీల చేతిలో మరణించారు. 9 మంది ప్రమాదవశాత్తు చనిపోయారు. ఒకరు బయటి వ్యక్తుల దాడిలో మృతి చెందారు. 103 మంది ఖైదీల మృతి కారణాలపై ఇంకా తుది నిర్ణయానికి రావాల్సి ఉంది. 3 ఏళ్ల తర్వాత ఎన్సీఆర్బీ ఈ వివరాలు ప్రకటించింది.
అసహజ మరణాల్లో ఉత్తరప్రదేశ్ (56) మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్ర (47), పంజాబ్ (37), తమిళనాడు (11) తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 20 మంది ఖైదీలు ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడు, హరియాణాలో తొమ్మిదేసి మంది, పంజాబ్, రాజస్థాన్‌లో 8 మంది బలవన్మరణం చెందారు.
ఏళ్ల పాటు జైల్లో...
దేశవ్యాప్తంగా 11, 834 మంది విచారణ ఖైదీలు 3-4 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. 3,927 మంది ఐదేళ్ల కంటే ఎక్కువే కారాగారాల్లో మగ్గారు.
దేశవ్యాప్తంగా ఉన్న కారాగారాల సంఖ్య 4,33,003. ఇందులో ఉత్తరప్రదేశ్‌లోనే 26,785 జైళ్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 26,785 మంది నేరస్థులు బందీలుగా ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న నేరస్థుల్లో 19.7 శాతం మంది ఉత్తరప్రదేశ్‌లోనే జైలు జీవితం గడిపారు.
ఇదీ చూడండి: 'మోదీలందరూ దొంగలే అనడం తగునా?'