ETV Bharat / bharat

'కేంద్రమంత్రే ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించారు' - Gajendra singh shekhawat

రాజస్థాన్​లో కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ శత విధాల ప్రయత్నించారని సీఎం అశోక్ గహ్లాత్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు షెకావత్‌ ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారని తెలిపారు.

Union minister tries to overthrow government: Ashok Gehlot
'కేంద్ర మంత్రే ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించారు'
author img

By

Published : Jul 23, 2020, 11:15 PM IST

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ అన్నివిధాలుగా ప్రయత్నించారని ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు షెకావత్‌ ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు.

తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు భాజపా తరుఫున ఫోన్‌లో మాట్లాడింది షెకావతేనని గహ్లోత్​ ఆరోపించారు. కేంద్రమంత్రి ఏ నేరం చేయకపోతే వాయిస్ శాంపిల్ ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.

ఆడియో క్లిప్‌లు సృష్టించారన్న షెకావత్‌ ఆరోపణలను ఖండించిన గహ్లాత్... రాజస్థాన్ ప్రభుత్వంపై నమ్మకం లేకపోతే వాయిస్‌ శాంపిల్లను ఎఫ్​ఎస్​ఎల్​ పరీక్షల కోసం అమెరికాకు పంపిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: భారత్​-చైనా మధ్య త్వరలోనే మరో దఫా చర్చలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.