జమ్ము కశ్మీర్ పరిస్థితులపై నేడు కేంద్ర హోంమంత్రి అమిత్షా అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులు, సమాచార వ్యవస్థ పునరుద్ధరణపై ఆయన సమీక్ష చేస్తారు. సాధారణ జనజీవనం సాఫీగా కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చిస్తారు.
పాకిస్థాన్ అక్రమ చొరబాట్లను, ఉగ్రవాద ప్రేరేపిత చర్యలను అరికట్టడం సహా పలు అంశాలపై అధికారులతో అమిత్షా చర్చిస్తారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్, హోంశాఖ, ఐబీ అధికారులు, సరిహద్దు భద్రతా దళం, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలు పాల్గొననున్నారు.
ఇదీ చూడండి: జీ-7: విజయంతో సగర్వంగా.. స్వదేశానికి మోదీ