ETV Bharat / bharat

'సొంతపార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుంటారా?' - కాంగ్రెస్ వార్తలు

కాంగ్రెస్​లో అంతర్గత సమస్యలు పెరిగిపోతున్నాయి. అసమ్మతి స్వరం వినిపించిన జితిన్ ప్రసాదను పార్టీ లక్ష్యంగా చేసుకుంటోందని సీనియర్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. సొంతపార్టీ నేతలనే లక్ష్యంగా చేసుకొని శక్తిసామర్థ్యాలను వృథా చేసుకోకుడదని హితవు పలికారు. సిబల్ వ్యాఖ్యలకు మద్దతు పలుకుతూ మరో సీనియర్ నేత మనీశ్ తివారీ ట్వీట్ చేశారు.

Unfortunate that Jitin Prasad is being targeted in UP: Kapil Sibal
'సొంతపార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుంటారా?'
author img

By

Published : Aug 27, 2020, 4:27 PM IST

కాంగ్రెస్​లో అసమ్మతివాదుల సమస్య సమసిపోయినట్లు కనిపించడం లేదు. పార్టీలో సంస్థాగత మార్పులు చేయాలంటూ లేఖ రాసిన 23 మంది సభ్యుల్లో ఒకరైన సీనియర్ నేత కపిల్ సిబల్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న భాజపాపై సర్జికల్ స్ట్రైక్స్(లక్ష్యంగా చేసుకోవాలని ఉద్దేశంతో) చేయాల్సిందిపోయి... సొంత పార్టీ నేత జితిన్ ప్రసాదను పార్టీ లక్ష్యంగా చేసుకుంటోందని ధ్వజమెత్తారు.

  • Unfortunate that Jitin Prasada is being officially targeted in UP

    Congress needs to target the BJP with surgical strikes instead wasting its energy by targeting its own

    — Kapil Sibal (@KapilSibal) August 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఉత్తర్​ప్రదేశ్​లో అధికారికంగా జితిన్ ప్రసాదను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరం. సొంతనేతలను లక్ష్యంగా చేసుకొని శక్తిసామర్థ్యాలను వృథా చేసుకోకుండా భాజపాపై లక్షిత దాడులకు ప్రయత్నించాలి."

-కపిల్ సిబల్, కాంగ్రెస్ సీనియర్ నేత

ఈ ట్వీట్​పై మరో కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ స్పందించారు. 'ముందుచూపుతో' అనే ఒక్క పదాన్ని ట్వీట్ చేశారు. లేఖ రాసినవారిలో తివారీ సైతం ఉన్నారు.

జితిన్ స్పందన

కాంగ్రెస్​కు పూర్తి స్థాయి అధ్యక్షుడిని నియమించాలని లేఖ రాసినవారిలో మాజీ మంత్రి జితిన్ ప్రసాద కూడా ఉన్నారు. సోమవారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ విషయంపై ప్రసాద నేరుగా స్పందించలేదు. అయితే సిబల్, తివారీ చేసిన పోస్టు​లను రీట్వీట్ చేశారు.

Unfortunate that Jitin Prasad is being targeted in UP: Kapil Sibal
జితిన్ ప్రసాద రీట్వీట్లు

కారణం ఇదే!

గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపిస్తూ ప్రసాద కుటుంబంపై చర్యలు తీసుకోవాలని యూపీలోని లఖింపుర్​ ఖెరి జిల్లా కాంగ్రెస్ కమిటీ.. ఓ తీర్మానాన్ని ఆమోదించినట్లు తెలుస్తోంది. జితిన్ తండ్రి జితేంద్ర ప్రసాద గతంలో సోనియాకు దీటుగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడాలని విఫలయత్నం చేశారని కమిటీ ఆరోపించినట్లు సమాచారం.

ఇదీ చదవండి- 'అలా చేయడం సభా హక్కులను ఉల్లంఘించడమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.