ETV Bharat / bharat

'కంగనాకు భాజపా మద్దతివ్వడం దురదృష్టకరం'

నటి కంగనా రనౌత్​.. మహారాష్ట్ర గవర్నర్​తో సమావేశం కావడం తీవ్ర వివాదాలకు తావిస్తోంది. రాష్ట్ర సీఎంను అవమానించిన ఒక నటికి భాజపా మద్దతుగా నిలవడం బాధాకరమైన విషయమని శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​  అభిప్రాయపడ్డారు. బిహార్​ ఎన్నికల్లో విజయం సాధించేందుకే భాజపా ఇలాంటి కుట్రలు చేస్తోందన్నారు.

Unfortunate that BJP backing Kangana who insulted Mumbai: Raut
కంగనాకు భాజపా మద్దతివ్వడం దురదృష్టకరం
author img

By

Published : Sep 13, 2020, 9:50 PM IST

మహారాష్ట్ర గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీతో.. బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ సమావేశమవడం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. ముఖ్యంగా ఈ విషయంపై శివసేన తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ముంబయిని పాక్​ ఆక్రమిత కశ్మీర్​తో పోలుస్తూ వ్యాఖ్యలు చేసిన కంగనాకు భాజపా మద్దతునివ్వడం చాలా దురదృష్టకరమని శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ తెలిపారు. దీన్ని ఆసరాగా చేసుకొని బిహార్​ ఎన్నికల్లో భాజపా విజయం సాధించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

ముంబయి నగర ప్రాముఖ్యతను తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని​ శివసేన అధికారిక పత్రిక 'సామ్నా'లో సంజయ్​ రౌత్​ పేర్కొన్నారు. మరాఠా ప్రజలకు ఇది గడ్డుకాలం లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. 'ఒక నటి ముఖ్యమంత్రిని అవమానిస్తున్నా.. ప్రజలు స్పందించకూడదా? ఇదేం ఏక పక్ష స్వేచ్ఛ?' అంటూ రౌత్​ విరుచుకుపడ్డారు.

ప్రతిపక్ష అభ్యర్థికే ఓటు..

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​ ఎన్నికలో ప్రతిపక్ష అభ్యర్థికే శివసేన మద్దతిస్తుందని సంజయ్ రౌత్​ స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ఇండో- చైనా సరిహద్దు వివాదం, జీఎస్టీ, నిరుద్యోగం వంటి అంశాలను రానున్న పార్లమెంట్​ సమావేశాల్లో లేవనెత్తుతానని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: మహారాష్ట్ర గవర్నర్​తో నటి కంగన భేటీ

For All Latest Updates

TAGGED:

Kangana
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.