ETV Bharat / bharat

భారత్​కు ఇరాన్​ ఝలక్​- చైనాతో సీక్రెట్ డీల్​ వల్లే!

ఇరాన్​లో భారత్​ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణం చాబహర్​ పోర్టు. ప్రాజెక్ట్​లో భాగంగా చాబహర్​ పోర్టు పట్టణం నుంచి అఫ్గానిస్థాన్​ సరిహద్దు ప్రాంతమైన జెహదన్​కు ఓ రైల్వే లైన్​ను నిర్మించాలని భారత్​​-ఇరాన్​ మధ్య ఒప్పందం కుదురింది. అయితే ఇరాన్​పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇది ఆలస్యమైంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్​ను తామే నిర్మించుకుంటామని ఇరాన్​ ప్రకటించింది. అయితే ఇందుకు ఇరాన్​-చైనా చేసుకుంటున్న రహస్య ఒప్పందమే కారణమా? ఏంటీ ఒప్పందం? చైనాకు లాభమేంటి? భారత్​కు నష్టం తప్పదా?

.Under the shadow of secret Iran-China pact, India left out of Chabahar rail project
చాహబర్​ రైల్వే ప్రాజెక్ట్​పై నీలినీడలకు కారణం చైనా?
author img

By

Published : Jul 15, 2020, 3:59 PM IST

Updated : Jul 15, 2020, 4:25 PM IST

చాబహర్​ పోర్టు... ఇరాన్​లో భారత్​ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వ్యూహాత్మక ప్రాజెక్ట్​. ఈ పోర్టులో కార్యకలాపాల ద్వారా మధ్య ఆసియాలో తన ప్రాముఖ్యాన్ని పెంచుకోవాలని భావించింది భారత్​. ప్రాజెక్ట్​ రెండో దశలో భాగంగా.. 628 కిలోమీటర్ల రైల్వే లైన్​ను నిర్మించడానికి అంగీకరించింది. ఇది ఇరాన్​ పోర్టు పట్టణం చాబహర్​ను.. అఫ్గానిస్థాన్​ సరిహద్దు ప్రాంతం జెహదన్​ను కలుపుతుంది.

అయితే ఇరాన్​పై అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపించిన తరుణంలో ఈ ప్రాజెక్ట్​ ప్రారంభం ఆలస్యమైంది. పనులు మొదలుపెట్టాలని ఇరాన్​ అభ్యర్థించినా.. అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత్​ ముందడుగు వేయలేదు. ఇదంతా పాత కథే. అయితే ఇటీవలే ఇరాన్​ అనూహ్యంగా ఓ ప్రకటన చేసింది. రైల్వే లైన్​ను తామే నిర్మించుకుంటామని వెల్లడించింది. గత మంగళవారం ఇందుకు సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టేసింది.

ఇరాన్​ అనూహ్యంగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? అసలు ఈ రైల్వే ప్రాజెక్ట్​ వ్యవహారం ఇప్పుడు తెరపైకి ఎందుకు వచ్చింది? ఇంత భారీ ప్రాజెక్ట్​ను ఇరాన్​ స్వయంగా నిర్మించుకోగలదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్​తో చైనా చేసుకోబోతున్న ఓ "రహస్య" ఒప్పందం.. వీటన్నిటికీ సమాధానంగా కనపడుతోంది.

ఇరాన్​-చైనా ఒప్పందం...

ఒప్పందంపై ఇరాన్​-చైనా ఇప్పటివరకు బహిరంగ ప్రకటనలు చేయలేదు. అయితే ఇది దాదాపు ఖరారు అయిపోయినట్టు తెలుస్తోంది. ఇరాన్​లో చైనా భారీ పెట్టుబడులు పెట్టడం.. బదులుగా అతి తక్కువ​ ధరలకు ఆ దేశ చమురు విక్రయించడం, మిలిటరీ సామగ్రి సహా ఇతర రంగాల్లో 25ఏళ్ల పాటు సహకారం పొందడం ఈ ఒప్పందంలో భాగం.

ఈ విషయాన్ని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ సలహాదారు అలీ అకా-మొహమ్మది ప్రస్తావించారు. అమెరికాపై పరోక్షంగా నిందారోపణలు చేశారు.

"దీనితో(ఒప్పందంతో) ఆర్థిక, రక్షణ సహకారంలో ఇరు దేశాల బంధం మరింత బలపడుతుంది. మూడో వ్యక్తి(అమెరికా) జోక్యం చేసుకోకుండా రక్షణ కల్పిస్తుంది. ఆంక్షలతో ఇరాన్​-చైనా దెబ్బతీద్దాము అని అనుకున్న అమెరికా ప్రణాళికలు చిన్నాభిన్నమవుతాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ద్వారా డాలరుకు భారీ నష్టం జరుగుతుంది."

-- అలీ అఖా-మొహమ్మది, ఇరాన్ సుప్రీం నేత సలహాదారు.

చైనాకు లాభమేంటి?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చైనాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత్​ సరిహద్దు వివాదం సహా అనేక విషయాల్లో చైనా తీరుపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. చైనాను ఏకాకిని చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

మరోవైపు భారత్​-అమెరికా మధ్య సంబంధాలు రోజురోజుకు బలపడుతున్నాయి. ఇదే సమయంలో భారత్​, అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియా దేశాలు కలిసి 'క్వాడ్​' ఏర్పాటు చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ చైనాకు ప్రతికూల అంశాలే.

ఇదే సమయంలో 'శత్రువుకు శత్రువు మిత్రుడు' అన్న సిద్ధాంతాన్ని చైనా పాటిస్తోంది. అమెరికా ఆంక్షల కత్తి కారణంగా దెబ్బతిన్న ఇరాన్​తో ఒప్పందం కుదుర్చుకుంటోంది బీజింగ్.

ఒప్పందంలో ఏముంది?

  • ఇరాన్​లో 400 బిలియన్​ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి చైనా సన్నద్ధమవుతోంది.
  • 25ఏళ్ల కాలంలో సైనిక, భద్రత, ఆర్థిక, రైల్వే, పోర్టులు, టెలికాం, బ్యాంకింగ్​ రంగాల్లో దాదాపు 100 ప్రాజెక్ట్​లు చేపట్టనున్నారు.
  • ఈ ప్రాజెక్టులను సంరక్షించేందుకు తమ దేశానికి చెందిన 5వేల మంది సైనికులను చైనా.. ఇరాన్​కు పంపించే అవకాశముంది.

భారత్​కు నష్టమా?

ఈ రైల్వే ప్రాజెక్ట్​ను ఇర్​కాన్​ అనే భారత సంస్థ చేపట్టింది. ఇందుకోసం 1.6 బిలియన్​ డాలర్లు ఖర్చు చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. మరో 400 మిలియన్​ డాలర్లు జాతీయాభివృద్ధి నిధి నుంచి కేటాయించింది ఇరాన్. ఈ ప్రాజెక్టులో ఉండటం వ్యూహాత్మకంగా భారత్​కు ఎంతో ముఖ్యం. క్లిష్టమైన మధ్య ఆసియాలోకి ప్రవేశించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

సొంతంగానే రైల్వే ప్రాజెక్ట్​ చేపట్టాలనుకున్న ఇరాన్​ నిర్ణయం వెనుకు భారత దేశ అంతర్గత వ్యవహారాలు కూడా ఓ కారణంగా కనపడుతున్నాయి.

జమ్ముకశ్మీర్​కు స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ 2019 ఆగస్టు 5న నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. దీనితో పాటు షియా ముస్లింలు ఎక్కువగా ఉండే కార్గిల్​ ప్రాంతాన్ని లద్దాఖ్​ కేంద్రపాలిత ప్రాంతంలో కలిపింది. దీనిపై ఇరాన్​ బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేసింది.

మరోవైపు అమెరికా ఆంక్షలు కూడా భారత్​-ఇరాన్​ సంబంధాలు బలహీనపడటానికి కారణమయ్యాయి. అగ్రరాజ్యం చర్యలతో ఇరాన్​ నుంచి చమురును ఎగుమతి చేసుకోకూడదని భారత్​ నిర్ణయించింది.

సాధారణంగా 80శాతం చమురు అవసరాలను దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది భారత్​. ఈ నేపథ్యంలో ఇరాన్​ నుంచి చమురు కొనుగోలు చేయడంలో భారత్​ రెండో స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అమెరికా, వెనుజువెలాపై ఆధారపడుతోంది భారత్​.

అయితే ఈ "చైనా-ఇరాన్​ సమగ్ర వ్యూహాత్మక" ఒప్పందానికి ఇరాన్​లోని ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. చైనాతో చర్చల్లో ఇరాన్​ స్థాయి దిగజారుతోందని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ పరిణామాలు భారత్​పై భౌగోళికంగా, వ్యూహాత్మకంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.

(రచయిత- సంజీవ్ బారువా, సీనియర్ జర్నలిస్ట్)

ఇదీ చూడండి:- అవినీతి నేతల అండతో చైనా దురాక్రమణ కుట్రలు!

Last Updated : Jul 15, 2020, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.