ETV Bharat / bharat

బిహార్​ పొత్తులపై ఎటూ తేల్చని ఎల్​జేపీ

బిహార్​ ఎన్నికల్లో ఎన్​డీఏతో కలిసి పోటీ చేసే విషయంపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు చిరాగ్​ పాసవాన్​కే అప్పచెప్పింది ఎల్​జేపీ. సోమవారం జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఈమేరకు తీర్మానం చేసింది. అయితే జేడీయూతో కలిసి పోటీ చేయడంపై ఎల్​జేపీ సీనియర్ నేతలు విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​తో తెగదెంపులు చేసుకోవాలని డిమాండ్​ చేసినట్టు తెలుస్తోంది.

uncertainty over contesting against JDU in Bihar elections continues in LJP
బిహార్​ ఎన్నికలపై ఎల్​జేపీలో వీడని అనిశ్చితి
author img

By

Published : Sep 7, 2020, 7:42 PM IST

బిహార్​ ఎన్నికల్లో జేడీయూ-భాజపా కూటమితో కలిసి పోటీ చేయడంపై లోక్​ జనశక్తి పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంపై సోమవారం జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఓ స్పష్టత వస్తుందని భావించినప్పటికీ.. అలా జరగలేదు. కూటమితో కొనసాగాలా? వద్దా? అనే విషయాన్ని నిర్ణయించే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు చిరాగ్​ పాసవాన్​కు అప్పచెప్పాలని ఈ భేటీలో పాల్గొన్న నేతలు తీర్మానించారు.

'మాకొద్దు ఈ పొత్తు...'

బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ నేతృత్వంలో ఎన్నికల బరిలో దిగకూడదని.. సమావేశంలో ఎల్​జేపీ నేతలు డిమాండ్​ చేసినట్టు సమాచారం. జేడీయూకు వ్యతిరేకంగా అభ్యర్థులను దింపాలని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఎన్నికల నిర్వహిస్తున్నందుకు.. నితీశ్​ కుమార్​పై ప్రజలు అసంతృప్తితో ఉన్న విషయాన్ని వారు ప్రస్తావించినట్టు పార్టీ వర్గాల సమాచారం.

అయితే.. ఎల్​జేపీ ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రజల సమస్యలను లేవనెత్తడానికి నిరంతరం శ్రమిస్తామని.. సమావేశానికి హాజరైన చిరాగ్​ పాసవాన్​ పేర్కొన్నట్టు తెలుస్తోంది.

ఎన్నికల అభ్యర్థుల విషయంపైనా ఈ భేటీలో చర్చ జరిగింది. 143 స్థానాలకు.. వీలైనంత త్వరగా అభ్యర్థులను ఎంపిక చేసి, ఆ జాబితాను పార్లమెంటరీ బోర్డుకు పంపించాలని నేతలు నిర్ణయించారు.

'అది పార్టీ ఇష్టం...'

బిహార్​ ఎన్నికల్లో 143మంది అభ్యర్థులతో కూడిన జాబితాను రూపొందించాలన్న ఎల్​జేపీ నిర్ణయంపై జేడీయూ స్పందించింది. అంతర్గత వ్యవహారాలను నిర్ణయించుకునే హక్కు ప్రతి పార్టీకి ఉందని జేడీయూ నేత రాజీవ్​ రాజన్​ వెల్లడించారు. ఎలజేపీ నిర్ణయంలో ప్రత్యేకత ఏం లేదని పేర్కొన్నారు.

కూటమిలో చీలక!

ఎన్డీఏ వ్యతిరేక కూటమిలో ఉన్న మాజీ సీఎం జీతన్​రాం మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్​ మోర్చా.. జేడీయూతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించింది. దీనిని లోక్​ ​జనశక్తి పార్టీ (ఎల్​జేపీ) వ్యతిరేకిస్తోంది. మొదటి నుంచే జేడీయూతో అంటీముట్టనట్లు ఉండే ఆ పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులపై తమ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టాలని యోచిస్తున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.