ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు, నదీ ప్రవాహం సృష్టించిన విలయంలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు నాలుగో రోజు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 32 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 174 మంది ఆచూకీ తెలియలేదు.
![U'khand disaster](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10570389_523.jpeg)
ముఖ్యంగా తపోవన్ విద్యుత్ కేంద్రంలో చిక్కుకున్నట్లు భావిస్తున్న సుమారు 35 మందిని సురక్షితంగా వెలికితీసేందుకు సహాయ బృందాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. సైన్యం, ఇంటో-టిబెటన్ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ), జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్) బలగాలు.. కాలంతో పోటీ పడి పనిచేస్తున్నాయి.
![U'khand disaster](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10570389_32.jpg)
![U'khand disaster](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10570389_53.jpg)
టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని కనిపెట్టేందుకు అత్యాధునిక డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ పరికరాలను వాడుతున్నారు.
తపోవన్ వద్ద చినూక్ హెలికాప్టర్‌తో గాలింపు చర్యలు నిర్వహించారు.
![U'khand disaster](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10570389_53.png)
ఐటీబీపీ, ఆర్మీ, స్థానిక యంత్రాంగం అధికారులు ఎప్పటికప్పుడు సమావేశమై... సమన్వయంతో ముందుకు సాగుతున్నారు.
![U'khand disaster](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10570389_2.jpg)
ఇదీ చూడండి: లైవ్ వీడియో: వరదలో కొట్టుకుపోయిన కార్మికులు
రెండున్నర కిలోమీటర్ల పొడవున్న సొరంగం నుంచి బయటకు వస్తున్న బురద.. సహాయ చర్యలకు ఆటంకం ఏర్పరుస్తోంది. భారీ యంత్రాల ద్వారా బురదను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 120 మీటర్ల వరకు శిథిలాలను తొలగించారు. లోపల ఉన్న వారి ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాలను పంపినా.. అంతా చీకటిగా ఉండటం వల్ల పెద్దగా ఫలితం లేదు. మరోవైపు.. సొరంగంలో చిక్కుకుపోయిన తమవారి రాక కోసం కుటుంబసభ్యులు వేచి చూస్తున్నారు.
![U'khand disaster](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10570389_4.jpg)
హెలికాప్టర్లతో నిత్యవసరాలు సరఫరా..
హిమనీనదం సృష్టించిన జలవిలయంతో పలు గ్రామాలకు.. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అక్కడి ప్రజలకు.. ఐటీబీపీ సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా నిత్యవసరాలు సరఫరా చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్లి.. వారికి ఆహార పదార్థాలను అందిస్తున్నారు.
-
#WATCH | ITBP personnel seen carrying ration to villages cut off due to glacier burst and traversing through mountainous terrain in #Uttarakhand. Visuals from Lata Helipad in Chamoli district
— ANI (@ANI) February 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
(Video source: ITBP) pic.twitter.com/YK52l9sFFV
">#WATCH | ITBP personnel seen carrying ration to villages cut off due to glacier burst and traversing through mountainous terrain in #Uttarakhand. Visuals from Lata Helipad in Chamoli district
— ANI (@ANI) February 10, 2021
(Video source: ITBP) pic.twitter.com/YK52l9sFFV#WATCH | ITBP personnel seen carrying ration to villages cut off due to glacier burst and traversing through mountainous terrain in #Uttarakhand. Visuals from Lata Helipad in Chamoli district
— ANI (@ANI) February 10, 2021
(Video source: ITBP) pic.twitter.com/YK52l9sFFV
ఫిబ్రవరి 7న జలప్రళయం ధాటికి ఛమోలీ సహా చుట్టుపక్కల గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విష్ణుప్రయాగ్లోని పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. గోడలకు బీటలు వారాయి.
బాధితుల బంధువులు ఆందోళన..
రిషిగంగ ప్రాజెక్ట్ వద్ద పనిచేసే సుమారు 40 మంది కార్మికుల కుటుంబసభ్యులు బుధవారం నిరసనకు దిగారు. అలకనందా నదీ వద్ద జలవిలయం అనంతరం.. సహాయక చర్యలు సక్రమంగా చేపట్టలేదని ఆరోపించారు. ప్రాజెక్ట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
''విషాదం జరిగి 4 రోజులైంది. ముఖ్యంగా రహదారుల పునరుద్ధరణపైనే వారందరి దృష్టి నెలకొంది. తప్పిపోయిన కార్మికులను కాపాడాలన్న ఉద్దేశం కనిపించట్లేదు.''
- ఓ బాధితుడి సోదరుడు
ఇదీ చూడండి: ఉత్తరాఖండ్ వరదలు: ఆ పరికరంపైనే 'అణు'మానాలు