ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉగాండాకు చెందిన మహిళ తన చెప్పుల్లో డ్రగ్స్ రవాణా చేస్తూ పట్టుబడింది. దిల్లీ నుంచి వచ్చిన ఆమె దగ్గర నుంచి సుమారు రూ.2.5 కోట్లు విలువైన 501 గ్రాముల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్స్ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అంతర్జాతీయంగా డ్రగ్స్ అక్రమ సరఫరా చేసే ముఠాలో ఆమె సభ్యురాలని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:భారత్‌లోనూ కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం!