ETV Bharat / bharat

మహారాష్ట్రలో కొలువుదీరిన ఠాక్రే ప్రభుత్వం.. ఆరుగురితో కేబినెట్​ - UDDHAV THACKREY

Thackrey
ఠాక్రే
author img

By

Published : Nov 28, 2019, 10:09 AM IST

Updated : Nov 28, 2019, 7:27 PM IST

19:22 November 28

  • Congratulations to Uddhav Thackeray Ji on taking oath as the CM of Maharashtra. I am confident he will work diligently for the bright future of Maharashtra. @OfficeofUT

    — Narendra Modi (@narendramodi) November 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఠాక్రేకు ప్రధాని శుభాకాంక్షలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్​ ఠాక్రేకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి బాధ్యతలు ఠాక్రే శ్రద్ధగా నిర్వర్తిస్తారన్న నమ్మకం ఉందని ట్వీట్ చేశారు.

19:07 November 28

మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా బాల్​ఠాక్రే తనయుడు, శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. బాల్‌ఠాక్రే పలు కీలక ప్రసంగాలు చేసిన దాదర్‌లోని శివాజీపార్క్‌లో ఉద్ధవ్ సీఎంగా ప్రమాణం చేశారు. మహా అఘాడీ వికాస్​ కూటమి పార్టీల కీలక నేతలు శివసేన కార్యకర్తల కోలాహలం నడుమ మహారాష్ట్ర  గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఉద్ధవ్  ఠాక్రేతో ప్రమాణ స్వీకారం చేయించారు.. ఛత్రపతి శివాజీ, తల్లిదండ్రులను స్మరిస్తూ దైవసాక్షిగా ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణం చేశారు. 

ఆరుగురితో మంత్రివర్గం

శివసేన నుంచి ఆ పార్టీ శాసనసభాపక్షనేత ఏక్‌నాథ్‌ షిండే, సుభాష్‌ దేశాయ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్సీపీ నుంచి చగన్‌ భుజ్‌బల్‌, జయంత్‌ పాటిల్‌, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ తోరట్, నితిన్ రౌత్ ప్రమాణ స్వీకారం చేశారు.

శాసనసభకు ఎన్నిక కాకుండానే..

మహా వికాస్ అఘాడీ తరుఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రే, శాసనసభకు, శాసనమండలికి ఎన్నిక కాకుండానే సీఎంగా బాధ్యతలు  చేపట్టిన ఎనిమిదో వ్యక్తిగా నిలిచారు. కాంగ్రెస్ నేతలు ఏఆర్  అంతులయ్, వసంత్‌దాదా పాటిల్, శివాజీ రావ్ నీలాంగేకర్ పాటిల్ ,శంకర్‌ రావ్ చవాన్, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్ గతంలో ఎమ్మెల్యే గా , ఎమ్మెల్సీగా  ఎన్నిక కాకుండానే.. సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ సైతం ఇదే రీతిలో గతంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రమాణం స్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రే ఎనిమిదో  వ్యక్తిగా నిలిచారు.

ప్రముఖుల హాజరు

ఉద్ధవ్ ప్రమాణ స్వీకారానికి  డీఎంకే అధినేత స్టాలిన్, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాజరయ్యారు. వీరితో పాటు భాగస్వామ్య పక్షాలకు చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు. 

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ కుటుంబం, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తదితరులు హాజరయ్యారు. మరోవైపు ఉద్ధవ్ ప్రమాణానికి... కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దూరంగా ఉన్నారు. ఈ మేరకు ఉద్ధవ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాశారు.

ఠాక్రే కుటుంబం నుంచి తొలి వ్యక్తి

ఠాక్రే కుటుంబం నుంచి ప్రభుత్వంలో పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా.. ఉద్ధవ్ నిలిచారు. శివసేన నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మూడోవ్యక్తిగా ఉద్ధవ్ గుర్తింపు పొందారు.  గతంలో మనోహర్‌జోషి, నారాయణ్‌రాణే శివసేన నుంచి ముఖ్యమంత్రిగా పనిచేశారు.

18:42 November 28

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు.

18:21 November 28

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో మహా సీఎంగా ప్రమాణం చేయనున్నారు శివసేన అధినేత. ఆయనతో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.

17:03 November 28

ఉద్ధవ్​కు సోనియా లేఖ

  • Sonia Gandhi in a letter to Uddhav Thackeray: Shiv Sena,NCP&Congress have come together under quite extraordinary circumstances, at a time when country faces unprecedented threats from BJP. I regret that I'll not be able to be present at the ceremony (oath-taking). #Maharashtra pic.twitter.com/wHs95Y7mV6

    — ANI (@ANI) November 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాసేపట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఉద్ధవ్​ ఠాక్రేకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాలేకపోతున్నానని, అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

"భాజపా కారణంగా దేశం ఎన్నడూ లేని ముప్పుల్ని ఎదుర్కొంటున్న అసాధారణ పరిస్థితుల్లో శివసేన, కాంగ్రెస్, ఎన్​సీపీ ఏకతాటిపైకి రావాల్సి వచ్చింది. దేశంలో రాజకీయ వాతావరణం విషపూరితమైంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. శివసేన, కాంగ్రెస్​, ఎన్​సీపీ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించున్నాయి. ఈ ప్రణాళికను మూడు పార్టీలు చిత్తశుద్ధితో అమలు చేసి, ప్రజల అంచనాలను అందుకుంటాయని విశ్వసిస్తున్నా."

-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

16:21 November 28

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. ముంబయి శివాజీ పార్క్​ వేదికగా సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రముఖుల రాక దృష్ట్యా భారీగా భద్రతా బలగాలు మోహరించారు.

ఆరుగురు మంత్రులు...

ఆరుగురు మంత్రులతో ఉద్ధవ్​ ప్రభుత్వం కొలువుదీరనుంది. కూటమిలోని సభ్య పార్టీలైన శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​ నుంచి ఇద్దరు చొప్పున... ఈ సాయంత్రం మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

ఎన్​సీపీ నుంచి జయంత్ పాటిల్, ఛగన్​ భుజ్​బల్​ మంత్రివర్గంలో చేరనున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు బాలాసాహెబ్ తోరట్, రాష్ట్ర మాజీ మంత్రి నితిన్​ రౌత్​ ఉద్ధవ్​ సర్కార్​లో భాగస్వామి అయ్యే అవకాశముంది. 

శివసేన నుంచి ఏక్​నాథ్​ శిందేకు మంత్రి పదవి ఖరారైనట్లు సమాచారం. మరొక మంత్రి ఎవరన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

అజిత్ లేకుండానే...

ఉద్ధవ్​ ప్రభుత్వంలో ఎన్​సీపీ నేత అజిత్​ పవార్​ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని తొలుత ఊహాగానాలు వినిపించాయి. అయితే తాను ఈరోజు ప్రమాణం చేయడంలేదని ఆయన స్పష్టంచేశారు. డిప్యూటీ సీఎం పదవిపై పార్టీలో చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

డిసెంబర్ 3న రెండో దశ...

డిసెంబర్​ 3న ఉద్ధవ్​ ఠాక్రే మంత్రివర్గాన్ని విస్తరిస్తారని సమాచారం. అజిత్​కు ఉపముఖ్యమంత్రి పదవి సహా ఇతర మంత్రులు ఎవరన్న అంశంపై అప్పటికి స్పష్టత వచ్చే అవకాశముంది.
 
14:33 November 28

సాయంత్రం మహారాష్ట్ర మంత్రిగా తాను ప్రమాణం చేయడంలేదని స్పష్టంచేశారు ఎన్​సీపీ నేత అజిత్​ పవార్. ఉపముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపడతారన్న వార్తల మధ్య అజిత్​ ఈ ప్రకటన చేశారు. ఎన్​సీపీ నుంచి ఛగన్​ భుజ్​బల్​, జయంత్ పాటిల్​ మాత్రమే నేడు ప్రమాణం స్వీకారం చేస్తారని ముంబయిలో శరద్​ పవార్ నివాసంలో జరిగిన పార్టీ నేతల సమావేశం తర్వాత వెల్లడించారు అజిత్.

"ఒక్కో పార్టీ(ఎన్​సీపీ, శివసేన, కాంగ్రెస్​) నుంచి ఇద్దరు చొప్పున ఈరోజు మొత్తం ఆరుగురు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉప ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై పార్టీ నిర్ణయం తీసుకోవాలి."

- అజిత్ పవార్, ఎన్​సీపీ నేత

12:39 November 28

ఎన్​సీపీ నేత అజిత్​ పవార్​ ఫోన్​ స్విచ్ ఆఫ్​ చేయడం కలకలం రేపింది. కొద్దిరోజుల క్రితం ఆయన అనూహ్యంగా శరద్​ పవార్​ను వీడి వెళ్లి, భాజపాకు మద్దతు తెలిపిన నేపథ్యంలో... ప్రస్తుత పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే... ఈ ఊహాగానాలన్నింటినీ తోసిపుచ్చారు ఎన్​సీపీ అధికార ప్రతినిధి. తరచుగా కాల్స్​ వస్తున్నందునే అజిత్​ ఉద్దేశపూర్వకంగా సెల్​ ఫోన్​ స్విచ్​ ఆఫ్ చేశారని స్పష్టంచేశారు. సాయంత్రం ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరవుతారని చెప్పారు.

10:35 November 28

ఉద్ధవ్​తో పాటు ఇంకెవరు?

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే. ఇందుకు ముంబయిలోని శివాజీ పార్కు ముస్తాబువుతోంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి అతిరథమహారథులు తరలివెచ్చే అవకాశమున్న తరుణంలో భద్రతా పరిణామాలపై అధికారులు అధిక దృష్టి సారించారు.

ఉద్ధవ్​తో పాటు...

ఉద్ధవ్​ ఠాక్రేతో పాటు ఎన్​సీపీ నుంచి జయంత్​ పాటిల్​, ఛగన్​ భుజ్​బల్​.. మహారాష్ట్ర కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్​ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. 

ప్రభుత్వ ఏర్పాటులో భాజపాకు మద్దతిచ్చి సంచలనం సృష్టించిన ఎన్​సీపీ నేత అజిత్​ పవార్​కు ఉపముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశముందని తెలుస్తోంది. అయితే.. నేడు అజిత్​ ప్రమాణస్వీకారం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

సోనియా నిర్ణయం...

ప్రమాణస్వీకార మహోత్సవానికి అథిరథమహారథులను ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

10:19 November 28

సోనియా ఇంకా నిర్ణయించుకోలేదు

ఉద్ధవ్​ ఠాక్రే ప్రమాణస్వీకార మహోత్సవానికి కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు ఆ పార్టీకి చెందిన అనేక మంది సీనియర్​ నేతలకు ఆహ్వానాలు అందాయి. అయితే ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సోనియా తెలిపారు. రాహుల్​ గాంధీ కూడా ఇదే విధంగా స్పందించారు. ప్రమాణస్వీకారానికి మరికొద్ది గంటలే మిగిలున్న వేళ సోనియా నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

10:16 November 28

ఉపముఖ్యమంత్రిగా అజిత్​ పవార్​!

ప్రభుత్వ ఏర్పాటులో భాజపాకు మద్దతిచ్చి సంచలనం సృష్టించిన ఎన్​సీపీ నేత అజిత్​ పవార్​కే ఉపముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశముందని ఆ పార్టీ వర్గాల సమాచారం. అయితే ఈరోజు ఉద్ధవ్​తో కలిసి అజిత్​ ప్రమాణ స్వీకారం చేయరని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

10:12 November 28

శివాజీ పార్కులో...

సీఎంగా ఉద్ధవ్​ ఠాక్రే ప్రమాణం చేయనున్న శివాజీ పార్కులో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అతిరథమహారుథులను కార్యక్రమానికి ఆహ్వానించిన తరుణంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

10:09 November 28

ముంబయి ముస్తాబు...

  • Mumbai: Hoardings welcoming the new government in #Maharashtra and party flags of Shiv Sena & Congress seen on the stretch from Dadar TT to Shivaji Park. The new state govt, led by Shiv Sena chief & 'Maha Vikas Aghadi' leader Uddhav Thackeray as the CM, will be sworn in today. pic.twitter.com/aegYvgxmbK

ఉద్ధవ్​ ఠాక్రే ప్రమాణస్వీకారం కోసం ముంబయి నగరం ముస్తాబవుతోంది. నగరవ్యాప్తంగా ఉన్న రహదారులపై ఉద్ధవ్​ ఠాక్రే ఫ్లెక్సీలు వెలిశాయి. 

09:52 November 28

నేడు ఉద్ధవ్​ ప్రమాణస్వీకారం

మహారాష్ట్రలో శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్‌తో కూడిన మహా వికాస్‌ అఘాడీ సర్కార్‌ స్థాపనకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్దవ్‌ఠాక్రే.. నేడు ప్రమాణం చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 6:40 గంటలకు దాదర్‌లోని శివాజీ పార్క్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. 

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights of two games per day totaling up to three minutes, but no more than two minutes from one game. Use within 48 hours. No archive. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No internet and no standalone digital use allowed.
SHOTLIST: Toyota Center, Houston, Texas, USA. 27th November 2019.
Houston Rockets 117, Miami Heat 108
1st Quarter
1. 00:00 Rockets Russell Westbrook
2nd Quarter
2. 00:08 Rockets Russell Westbrook dunks in transition, 36-25 Rockets
3. 00:23 Replay of dunk
4. 00:32 Rockets James Harden makes 3-point shot, 47-32 Rockets
5. 00:44 Rockets James Harden makes 3-point shot, 50-32 Rockets
3rd Quarter
6. 00:57 Rockets James Harden makes layup and draws foul, 83-60 Rockets
7. 01:11 Replay of layup and foul
4th Quarter
8. 01:20 Rockets Russell Westbrook makes jump shot, 111-96 Rockets
9. 01:32 Rockets James Harden after game
SOURCE: NBA Entertainment
DURATION: 01:39
STORYLINE:
James Harden scored 34 points, Russell Westbrook had 27 and the Houston Rockets snapped a three-game skid with a 117-108 victory over the Miami Heat on Wednesday night.
Houston led by double digits for most of this one after the Heat used a 46-point first quarter in a 129-100 rout Nov. 3 in the first meeting between the teams this season.
Kelly Olynyk scored six straight points to get the Heat within 10 with about a minute left. Harden made a free throw after that and Goran Dragic made one for the Heat. There was a bit of a scuffle after a hard foul by Dragic on Danuel House with about 30 seconds remaining. It was reviewed and upgraded to a flagrant 1 foul and House received a technical foul for his reaction after the foul.
Tyler Herro had 22 points and Olynyk scored 19 points with leading scorer Jimmy Butler out with an illness.
House had 23 points and Westbrook had nine rebounds and seven assists.
Last Updated : Nov 28, 2019, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.