మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో శివసేన మరోసారి అయోధ్య రామ మందిరాన్ని తెరపైకి తెస్తోంది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అయోధ్యను నేడు సందర్శించారు. అక్కడి రామ్ లల్లా గుడిలో 18 మంది పార్టీ నూతన ఎంపీలతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కుమారుడు ఆదిత్య, పార్టీ ఎంపీలతో కలసి 'జై శ్రీరామ్' నినాదాల మధ్య ఠాక్రే అయోధ్య సందర్శన నడిచింది. గతంలో ఇచ్చిన మాట ప్రకారమే ఠాక్రే అయోధ్యను సందర్శించారని.. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని పార్టీ ప్రకటించింది.
ఈ ఏడాదిలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భాజపాను రామ మందిర నిర్మాణం విషయంలో ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నంలో భాగమే ఈ సందర్శన అనే వార్తలు వినిపిస్తున్నాయి.
వివాదాస్పదమైన రామజన్మభూమి- బాబ్రీ మసీదు స్థలం కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణలో ఉంది.
- ఇదీ చూడండి: బిహార్: వడదెబ్బకు 2 రోజుల్లో 70 మంది బలి