క్రికెట్ బాల్ కొనడానికి ఇంట్లో వాళ్లు డబ్బులు ఇవ్వలేదని ఇద్దరు యువకులు హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సిధీ జిల్లా పోడే గ్రామంలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వారిని దించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అమిత్, గౌరవ్ అనే ఈ ఇద్దరు యువకులు దాదాపు 6 గంటల పాటు టవర్ మీదే ఉన్నారు.
వారంతట వారే..
ఈ ఇద్దరు యువకులు కొన్ని గంటల తర్వాత టవర్ నుంచి దిగారు. దీంతో గంటల పాటు ఆ ప్రాంతంలో ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. అయితే మొదట గౌరవ్ తనంతట తాను టవర్ దిగిపోగా పోలీసుల కృషితో కాసేపటికి అమిత్ కిందకి చేరుకున్నాడు. ఈ క్రమంలో యువకులు గాయపడగా.. వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టవర్‌కు విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి : 'ఒబామాకు ఆతిథ్యమిచ్చినట్టు.. వారినీ ఇంటికి పిలవండి'