ETV Bharat / bharat

ఒకే రోజు 2 స్పైస్​జెట్​ విమానాలకు ముప్పు!

స్పైస్ జెట్​కు చెందిన రెండు బోయింగ్ విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ముంబయి-చెన్నై విమానాన్ని ముంబయిలో అత్యవసరంగా ల్యాండ్​ చేశారు. బెంగళూరు-దిల్లీ విమానాన్ని నాగ్​పుర్ విమానాశ్రయంలో దించారు.

స్పైస్​ జెట్​
author img

By

Published : May 11, 2019, 3:37 PM IST

స్పైస్​ జెట్​ విమానాలు రెండింటికి గాలిలో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు సంస్థ అధికారులు తెలిపారు. వీటిలో ఒక విమానం ముంబయిలో, మరొకటి నాగ్​పుర్​ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్​ అయినట్లు వెల్లడించారు.

పూర్తి వివరాల్లోకెళ్తే..

స్పైస్​ జెట్​కు చెందిన బోయింగ్​ విమానం ఎస్​జీ-611 ఈ రోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్​ విమానాశ్రయం నుంచి చెన్నై బయల్దేరింది. గాల్లోకి ఎగిరిన 16 నిమిషాలకు విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు పైలట్లు. వెంటనే అప్రమత్తమై ముంబయి విమానాశ్రయ సిబ్బందితో మాట్లాడి అత్యవసరంగా ల్యాండ్​ చేశారు.

ఇంజనీర్లు లోపాన్ని సరి చేశారని.. తిరిగి అదే విమానం ఉదయం 10 గంటలకు చెన్నై బయల్దేరినట్లు స్పైస్ జెట్​ అధికారులు వెల్లడించారు.

బెంగళూరు నుంచి దిల్లీ బయల్దేరిన ఎస్​జీ 8720 విమానం దారిలో ఉండగానే సాంకేతిక సమస్య తలెత్తింది. వెంటనే 'ఏటీసీ'తో చర్చించిన పైలట్లు.. నాగ్​పుర్​ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా దించారు.

నాగ్​పుర్ నుంచి​ ప్రత్యేక విమానంలో ప్రయాణికులను దిల్లీకి తరలించామని స్పైస్​ జెట్​ తెలిపింది. ప్రయాణ సమయంలో రెండు బోయింగ్​ 737 విమానాల్లో ఎంత మంది ఉన్నారనేది వెల్లడించలేదు.

Lucknow (UP), May 11 (ANI): Former Uttar Pradesh chief minister and Samajwadi Party president Akhilesh Yadav gave an exclusive interview to ANI. During the interview he alleged BJP is trying to win the Lok Sabha election by issuing red card to SP candidates. The SP president also alleged that BJP has instructed officers to issue as many red cards as possible to SP candidates. Polling for the sixth phase will be held in 59 constituencies in six states and 1 Union Territory (Delhi) on Sunday, May 12.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.