మాదక ద్రవ్యాల్ని సరఫరా చేస్తోన్న ఇద్దరు నైజీరియన్లు సహా మరో ఇద్దరు అంతర్రాష్ట్ర వ్యక్తుల్ని కేంద్ర నేర విభాగం(సీసీబీ) అధికారులు కర్ణాటకలోని బెంగళూరులో అరెస్టు చేశారు. వారివద్ద నుంచి రూ. 75 లక్షల విలువ చేసే కేజీ ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీసీబీ అధికారులు వెల్లడించారు.
అంతేకాకుండా వారివద్ద నుంచి ఒక సెల్‌ఫోన్‌ను, బరువు కొలిచే యంత్రాన్ని, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆ ఇద్దరు నైజీరియన్లకు పాస్‌పోర్ట్‌లు లేవని తెలిపారు.
ఇదీ చూడండి: ఇంతకీ ఆయన ఎవరివైపు?: శివసేన