భారత వాయుసేనకు మరో రెండు షినుక్-47ఎఫ్(ఐ) హెలికాప్టర్లను త్వరలో పంపనున్నట్లు అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ ప్రకటించింది. అత్యంత శక్తిమంతమైన ఈ రవాణా హెలికాప్టర్లు గుజరాత్ ముంద్రా నౌకాశ్రయానికి రానున్నాయి. ఇప్పటికే నాలుగు హెలికాప్టర్లను ఫిబ్రవరిలో వాయుసేనకు అందించింది బోయింగ్.
రవాణా, మౌలిక సదుపాయాల మెరుగుపరుచుకునేందుకు రక్షణ శాఖ ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా బోయింగ్ సంస్థ నుంచి 22 అపాచీ, 15 షినుక్ హెలికాప్టర్ల కొనుగోలుకు 2015 సెప్టెంబరులో ఒప్పందం కుదుర్చుకుంది. షినుక్ ఎంతో ప్రత్యేకమైన హెలికాప్టర్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం వాయుసేన దగ్గరున్న ఎంఐ 26తో పోలిస్తే షినుక్ ఇంధన వినియోగమూ తక్కువ.
మరిన్ని ప్రయోజనాలు
సంక్షోభ సమయంలో సరిహద్దులకు బలగాలను తరిలించేందుకు ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. రెండు రొటేటర్లతో విభిన్నంగా కనిపించే ఈ హెలికాప్టర్లు పది టన్నుల బరువులను సైతం తేలికగా తరలిస్తాయి. ఇంధన సరఫరా, విపత్తు సహాయక కార్యక్రమాల్లో ఇవి బాగా ఉపయోగపడుతాయి.
ఇదీ చూడండి: ప్రైవేటు రంగం చేతుల్లోకి తేజస్ రైలు