ETV Bharat / bharat

బిహార్​ వరదల్లో 13కు చేరిన మృతులు - Two more die in Bihar floods, Assam flood situation improves

బిహార్​లో వరదల బీభత్సం కొనసాగుతోంది. తాజాగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 13కు చేరింది. మరోవైపు అసోంలో వరదలు తగ్గుముఖం పడుతున్నాయి. వరద ప్రభావితుల సంఖ్య 10 లక్షలకు తగ్గినట్లు అధికారులు తెలిపారు.

Bihar floods,
బిహార్​లో వరదల బీభత్సం కొనసాగుతోంది
author img

By

Published : Aug 2, 2020, 5:24 AM IST

Updated : Aug 2, 2020, 8:18 AM IST

బిహార్​లో వరదల కారణంగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య 13కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాలపై అధిక ప్రభావం ఉంది. సుమారు 50 లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. 1,043 గ్రామాలు నీటమునిగాయి.

Bihar floods,
పడవలే శరణ్యం

వర్షకాలం ప్రారంభం నుంచి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మొత్తం సగటు వర్షపాతం 768.5 మిల్లీమీటర్లగా నమోదైంది. ఇది సాధారణ వర్షపాతానికి 46 శాతం అధికం.

Bihar floods,
చెరువులను తలపిస్తున్న వీధులు

అసోంలో తగ్గుముఖం..

కొద్ది రోజులుగా వరదల్లో చిక్కుకున్న అసోంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నాయి. వర్షాలు తగ్గుతున్న నేపథ్యంలో వరదల ముంపు నుంచి ఒక్కో జిల్లా బయటపడుతోంది. అయితే.. ఇంకా 20 జిల్లాల్లో 10.63 లక్షల మందిపై వరదల ప్రభావం ఉన్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. దక్షిణ సల్మారా జిల్లాలో వరద తగ్గగా.. మరో 20 జిల్లాలు ఇంకా వరదల ముంపులోనే ఉన్నట్లు తెలిపింది. ఈ జిల్లాల్లో 75.710 హెక్టార్ల మేర పంట నీటమునిగిందని ప్రకటించింది.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మొత్తం 135 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అందులో 109 మంది వరదల కారణంగా మరణించగా.. 26 మంది కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయారు.

Bihar floods,
ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు

ఇదీ చూడండి: విలయంలో ఉపశమనం- తగ్గుతున్న మరణాల రేటు

Last Updated : Aug 2, 2020, 8:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.