జీతాల కోసం...
హైతీలో 2 నెలలుగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ఆ దేశాధ్యక్షుడు జొవెనెల్ మోయిసే రాజీనామా చేయాలన్నది నిరసనకారుల ప్రధాన డిమాండ్. వీరికి తోడుగా ఆదివారం పోలీసులు ఆందోళనబాట పట్టారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు.
వారిలో ఒకరు... అధ్యక్షుడు రాజీనామా చేయాలని నినదించగా... ప్రభుత్వ అనుకూల వర్గానికి చెందిన ఓ వ్యక్తి కాల్చిచంపాడు. వెంటనే పక్కనున్న నిరసనకారులు... కాల్పులు జరిపిన వ్యక్తిని కొట్టారు. నడిరోడ్డుపైనే సజీవదహనం చేశారు.
అలా మొదలైన హింస... కాసేపటికే తీవ్రరూపు దాల్చింది. కొందరు కార్లు తగలబెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు.
వచ్చినప్పటి నుంచే...
2017 ఫిబ్రవరిలో మోయిసే అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అవినీతి ఆరోపణలు, ఆగస్టులో జాతీయ ఇంధన సంక్షోభంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆ నిరసనలు మరింత హింసాత్మకంగా మారాయి.
ఇదీ చూడండి:దంగల్ 2.0 తీసేందుకు మరో యదార్థ కథ సిద్ధం!