మధ్యప్రదేశ్ సియోనీలో గోమాంసం తరలిస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను చితకబాదిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గోరక్షణ పేరిట భౌతికదాడులకు పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గోమాంసం కలిగి ఉన్నందుకు ముగ్గురు బాధితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటన మే 22న జరిగింది. ఇద్దరు పురుషులు, ఓ మహిళ వెళ్తుండగా ఐదుగురు 'గో రక్షకులు' అడ్డుకున్నారు. పురుషులు ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి చేశారు. మహిళను ఆమె సహచరులతోనే చెప్పులతో కొట్టించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఓ వ్యక్తి వీడియో తీశాడు.
గోరక్షణ పేరిట కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. తక్షణమే స్పందించిన పోలీసులు... దాడి చేసిన ఐదుగురు నిందితులను, ముగ్గురు బాధితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల నుంచి 140 కేజీల గోమాంసం, ఆటో, స్కూటర్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో గోమాంస విక్రయం నేరం.
ఇదీ చూడండి: చాయ్‌వాలా సంబరం... ఉచిత టీ, మటన్ విందు