ETV Bharat / bharat

రెండున్నరేళ్లకే 'ఇండియా బుక్'​లో చోటు.. ఎలా సాధ్యం? - Vaishnavi

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే సామెతకు చక్కటి ఉదాహరణ ఈ చిన్నారి. సరిగ్గా మాటలు కూడా రాని వయస్సులో అబ్బుర పరిచే ప్రతిభ కనబరుస్తోంది. తన జ్ఞాపకశక్తితో రెండున్నరేళ్లకే 'ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించింది.

India Book of Records
రెండున్నరేళ్లకే 'ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్'​లో చోటు
author img

By

Published : Jun 28, 2020, 10:15 AM IST

అమ్మ ఒడిలో ఆడుకుంటూ, మాటలు నేర్చుకునే వయస్సు ఆ చిన్నారిది. పిట్ట కొంచెం కూత ఘనం అనేలా తనదైన మాటలతో అబ్బురపరుస్తోంది. తనలోని ప్రత్యేక ప్రతిభతో రెండున్నరేళ్లకే 'ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​-2020'లో చోటు సంపాదించుకుంది. చిన్న వయస్సులోనే పెద్ద రికార్డును కొల్లగొట్టిన ఆ చిన్నారి పేరే వైష్ణవి. మరి ఈ పాపాయి ఏం చేసిందో తెలుసుకుందాం రండి..

జ్ఞాపకశక్తి అమోఘం..

5 సంస్కృత మంత్రాల పేర్లు, జాతీయ గీతం, 70 మంది గొప్ప గొప్ప చరిత్రకారుల పేర్లు, జంతువులు, పక్షులు, పండ్లు, కూరగాయలు, సౌర కుటుంబంలో గ్రహాల పేర్లు, గణితంలోని చిహ్నాలు, వారాలు, నెలలు, శరీరంలోని అవయవాల పేర్లును ఎక్కడా తడబడకుండా చెప్పేస్తుంది వైష్ణవి. ఇవే కాదండి పక్షులు, జంతువుల అరుపులను అనుకరిస్తుంది.

India Book of Records
ప్రశంసా పత్రం

ఈ ఏడాది మార్చిలో చిన్నారిలోని ప్రతిభను గుర్తించిన.. ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​ ప్రతినిధులు ప్రశంసా పత్రాన్ని అందించారు​. అవార్డులు, ప్రతిభకు వయస్సు అడ్డేకాదని నిరూపించిందీ చిన్నారి.

చిన్నప్పటినుంచే..

India Book of Records
తల్లిదండ్రులతో వైష్ణవి

ఉత్తర్​ప్రదేశ్​లోని మథురాకు చెందిన ఉమేశ్​ ముతాగి, సక్కుబాయ్​ దంపతుల కూతురే వైష్ణవి. ప్రస్తుతం ఉమేశ్​ భారత ఆర్మీలోని 51 రెజిమెంట్​లో విధులు నిర్వర్తిస్తున్నాడు. డ్యూటీలో భాగంగా వారు కర్ణాటక ధార్వాడ్​ సమీపంలోని జోదల్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు. వారికి 2017 సెప్టెంబర్​ 1న వైష్ణవి జన్మించింది. బుడిబుడి అడుగులు వేస్తున్న వయస్సులోనే చిన్నారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు... ఆ దిశగా మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.