భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో దాదాపు 550 ఖాతాలను ట్విట్టర్ తొలగించింది. బుధవారం ఈ విషయాన్ని ట్విట్టర్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.
రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడం, తదనంతర పరిణామాలపై అసంబద్ధ సందేశాలతో ట్విట్టర్ వేదికను దుర్వినియోగపరచిన వినియోగదారులపై ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
"మేం గట్టి వైఖరినే తీసుకున్నాం. అసంబద్ధ సందేశాలు, విద్వేష ప్రసంగాలు, బెదిరింపులు ఉద్రిక్తతలను పెంచుతాయి. కాబట్టి, మా వాణిజ్య సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించినవారి ఖాతాలను తొలగించాం."
-ట్విట్టర్ ప్రతినిధి
ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంలోనూ ఇలాగే వ్యవహరించినట్టు ట్విట్టర్ ప్రతినిధి తెలిపారు.