ETV Bharat / bharat

'కరాచీలో భారత వాయుసేన జెట్​ల చక్కర్లు!' - IAF fighter jets flew over karachi

భారత వైమానిక దళం.. మరోమారు లక్షిత దాడులు చేసే అవకాశముందంటూ కొందరు పాకిస్థాన్​ ప్రజలు తెగ ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై ట్విట్టర్​ వేదికగా భారత వాయుసేనపై నిందలు వేయాలని ప్రయత్నించారు. పాక్​ గగనతలంలో ఐఏఎఫ్​కు చెందిన యుద్ధవిమానాలు చక్కర్లు కొట్టినట్లు నమ్మబలికారు. అయితే పాక్​ వాసులు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించాయి భారత వాయుసేన అధికారిక వర్గాలు. పాక్​ గగనతలంలో తాము ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదని స్పష్టం చేశాయి.

Twitter abuzz with anxious users claiming IAF activity over Pakistan
ట్విట్టర్​ వేదికగా భారత వాయుసేనపై పాక్ వాసుల​ అక్కసు
author img

By

Published : Jun 10, 2020, 3:23 PM IST

పాకిస్థానీ ఉగ్రమూకలే లక్ష్యంగా భారత సైన్యం చేసిన లక్షిత దాడులు ఇప్పటికీ పాక్​ వాసుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తున్నాయి. అందుకే భారత వాయుసేన మరోమారు ఇలాంటి మెరుపు దాడులకు పాల్పడాలని ప్రయత్నిస్తోందంటూ తెగ ఆందోళన చెందుతున్నారు కొందరు.​ తాజాగా ఇదే అంశంపై ట్విట్టర్​ వేదికగా భారత వాయుసేన (ఐఏఎఫ్​)పై నిందలు మోపేందుకు ప్రయత్నించారు.

ఐఏఎఫ్​కు చెందిన యుద్ధ విమానాలు కశ్మీర్​లోని పాక్​ భూభాగంలో చక్కర్లు కొట్టాయని.. ట్విట్టర్​ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు పలువురు పాక్​ వాసులు. భారత వాయుసేన విమానాలను తాము ప్రత్యక్షంగా చూసినట్లూ.. నమ్మబలికారు.

"బహుశా కరాచీ చుట్టూ చాలా యుద్ధవిమానాలు తిరిగి ఉండొచ్చు. తర్వాతేంటి?" అని ఓ పాకిస్థానీ ట్వీట్​ చేశాడు. మరొకరైతే "కరాచీ విమానాశ్రయం​ సమీపంలో ఐఏఎఫ్​కు చెందిన యుద్ధ విమానాలను ప్రత్యక్షంగా చూశా" అని చెప్పుకొచ్చాడు. ఇంకొందరైతే " కూల్​ సర్​ప్రైజ్​ ఇచ్చేందుకు పాకిస్థాన్​ ఎయిర్​ ఫోర్స్​ సిద్ధంగా ఉంది" అంటూ ఏకంగా హెచ్చరిక ట్వీట్లు చేశారు.

కొందరు ట్విట్టర్​ వినియోగదారులు.. భారత్​-పాకిస్థాన్​ సరిహద్దులో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. "పాక్​ గగనతలంలో భారత వాయుసేన విమానాలు తిరగలేదు. నిజానికి రాజస్థాన్​ సరిహద్దులో పాక్​ విమానాలే ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి" అని పాక్ వాసులకు గుర్తు చేశారు. మరికొందరైతే మిగ్​ కమాండర్​ వర్ధమాన్​ అభినందన్​ సంఘటననూ గుర్తు చేసుకున్నారు.

ఐఏఎఫ్​ ఖండన

పాక్​ వాసులు ట్విట్టర్​ వేదికగా చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించాయి భారత వాయుసేన అధికారిక వర్గాలు. ఐఏఎఫ్​కు చెందిన యుద్ధవిమానాలు పాక్​ గగనతలంలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదని స్పష్టం చేశాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.