ఓనమ్.. కేరళలో అత్యంత వైభవంగా జరిగే పండుగ. ఆచారాలతో పాటు సంప్రదాయ క్రీడలకు ఓనమ్ ప్రత్యేకం. 10 రోజులకుపైగా జరుపుకొనే ఈ వేడుకల్లో ఒక్కో రోజు ఒక్కో రకం పోటీలు ఉంటాయి.
'టగ్ ఆఫ్ వార్'.. మలయాళంలో 'వాదం వళి' లేదా 'వాదం తూంగాల్' అంటారు. వాదం అంటే తాడు, తూంగాల్ అంటే ఎక్కడం, పట్టుకోవటం. గ్రామాల్లో ఈ ఆటకు విశేష ఆదరణ ఉంటుంది. ఓనమ్ నాలుగో రోజైన 'చతయ' సందర్భంగా కొల్లం జిల్లాలో ఈ పోటీలను ఘనంగా నిర్వహిస్తారు.
వాదం తూంగాల్ ఓ సాహస క్రీడను తలపిస్తుంది. తాడు సాయంతో కొలను దాటినవారిని విజయం వరిస్తుంది.
రూ.10 వేలు బహుమతి
ఈ పోటీలో పాల్గొనే వారికి చెట్లు ఎక్కడం తెలియాలి. కర్రను ఎలా పట్టుకోవాలి, నీళ్లలో పడకుండా ఎలా తప్పించుకోవాలో అవగాహన ఉండాలి. ఇవే ఈ ఆటకు నిబంధనలు. ఇందులో గెలిచిన వ్యక్తికి రూ.10వేలు బహుమతి లభిస్తుంది.
ఈ పోటీల కోసం నెల రోజుల ముందునుంచే సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఇందులో పాల్గొనేందుకు వేర్వేరు జిల్లాల నుంచి వస్తుంటారు ఔత్సాహికులు.
ఇదీ చూడండి: ఓనమ్ ప్రత్యేకం: ప్రతీకార కథతో స్నేహపూర్వక కుస్తీ