వేలకోట్ల రుణాలను ఎగవేసి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న పారిశ్రామిక వేత్త విజయ్‌మాల్యా ఇప్పుడప్పుడే భారత్‌కు వచ్చే అవకాశం లేదు. అక్కడి కోర్టులు మాల్యా అప్పగింతకు అవరోధాలు తొలగించినా.. కొన్ని న్యాయసమస్యలు అడ్డు వస్తున్నాయని భారత్‌లో బ్రిటన్ తాత్కాలిక హైకమిషనర్ జేన్ థాంప్సన్ తెలిపారు.
"పరిష్కరించాల్సిన న్యాయ సమస్యలు కొన్ని ఉన్నాయి. అప్పటివరకు అప్పగింత జరగదు. ఇవి రహస్యమైన అంశాలు. దీనిపై నేను ఎక్కువగా వ్యాఖ్యానించలేను. ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేను. వీలైనంత తొందరగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం."
- జేన్ థాంప్సన్, భారత్‌లో బ్రిటన్ తాత్కాలిక హైకమిషనర్
అప్పగింతకు వ్యతిరేకంగా మాల్యా దాఖలు చేసిన అన్ని అప్పీళ్లను బ్రిటిష్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో మాల్యా అప్పగింతపై బ్రిటన్ను భారత్ ఒత్తిడి చేస్తోంది.
ఇదీ చూడండి: మాల్యా కేసులో కేంద్రానికి సుప్రీం కీలక ఆదేశాలు