ETV Bharat / bharat

ట్రంప్​ పర్యటనతో.. ఎవరికెంత ప్రయోజనం?

రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ చేపట్టనున్న భారత్​ పర్యటనపై అంతర్జాతీయం స్థాయిలో ఆసక్తి నెలకొంది. అహ్మదాబాద్​ వేదికగా జరిగే ఈ కార్యక్రమం.. రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య పెనవేసుకుంటున్న బలమైన అనుబంధానికి తార్కాణం. మరి ఈ సమావేశంతో ఎవరికెంత లాభం చేకూరనుంది? విశ్లేషకులు ఈ విషయంపై ఏమంటున్నారో తెలుసుకుందాం.

trump visiting india by february 24. and is has a very big international program.. and also to see how it works for india.
ట్రంప్​ పర్యటనతో.. ఎవరికేంత ప్రయోజనం?
author img

By

Published : Feb 23, 2020, 8:32 AM IST

Updated : Mar 2, 2020, 6:38 AM IST

అంతర్జాతీయ సమాజం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమావేశానికి అహ్మదాబాద్‌ వేదికగా రేపు తెరలేవనుంది. శ్వేతసౌధాధిపతికి ఘన స్వాగతం పలికేందుకు దిల్లీ, అహ్మదాబాద్‌లను భారత ప్రభుత్వం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తోంది. వివిధ అంతర్జాతీయ వేదికలమీద భారత ప్రధాని మోదీ, డొనాల్డ్‌ ట్రంప్‌లు సమావేశమైనప్పుడు ఒకరినొకరు ప్రశంసించుకోవడం గతంలో అనేక సందర్భాల్లో చూశాం. ప్రపంచంలో రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య పెనవేసుకుంటున్న బలమైన అనుబంధానికి ఇది తార్కాణం. రెండురోజుల ట్రంప్‌ పర్యటన ఇరు పక్షాల మధ్య వ్యూహాత్మక అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు భారత్‌కు అమెరికా ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ సమీకరణల్లో భారత్‌ ప్రాధాన్యం క్రమంగా విస్తరిస్తోంది. కేవలం దక్షిణాసియాకు మాత్రమే పరిమితం కాకుండా ఇండో పసిఫిక్‌ ప్రాంతానికీ భారత్‌ పాత్ర విస్తరిస్తోంది. అంతర్జాతీయ వ్యూహ సమీకరణల్లో భారత్‌ వంటి ప్రజాస్వామ్య దేశం కీలక భూమిక పోషించడం అవసరమన్న వాదనా బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ రాక ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవంక దేశీయంగా రాజకీయ సంక్షోభం ఎదుర్కొని, అభిశంసన వేటునుంచి త్రుటిలో తప్పించుకుని, రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తలరాత ఏ తీరుగా మారుతుందో తెలియని పరిస్థితుల్లో, తిరిగి పీఠం దక్కించుకోవడానికి ఒక్కో ఓటు కోసం చెమటోడ్చాల్సిన పూర్వరంగంలో ట్రంప్‌ భారత్‌కు వస్తున్నారు. అమెరికాలోని హిందూ ఎన్‌ఆర్‌ఐలు, ముఖ్యంగా గుజరాతీలు ట్రంప్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్‌ పార్టీకి బలమైన మద్దతుదారులుగా ఉన్నారు. భారత్‌లోని మిగిలిన రాష్ట్రాలను కాదని గుజరాత్‌ను మాత్రమే ట్రంప్‌ తన పర్యటనకు ఎంపిక చేసుకోవడంలోని ఔచిత్యం బహిరంగ రహస్యం. విపరీతమైన ప్రచారం, అట్టహాసం, పెద్దయెత్తున జన సమీకరణ నడుమ ఈ పర్యటన జరుగుతుండటం వెనక రాజకీయ అవసరాలూ అర్థం చేసుకోలేనివి కావు. ఈ రాజకీయ కోణాన్ని పక్కనపెడితే- ప్రపంచ పరిణామాలను ప్రభావితం చేసే కీలక దేశాలుగా అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాల పురోగతికి ఈ పర్యటన ఏ మేరకు ఉపయోగపడుతుందన్న విషయంలో నిష్పాక్షిక విశ్లేషణ అవసరం. లోతుగా పరిశీలిస్తేనే అమెరికాతో సంబంధాల్లో భారత్‌ అనుసరించాల్సిన విధి విధానాలూ తేటపడతాయి.

పెరిగిన సాన్నిహిత్యం

ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండేవి. సోవియట్‌ యూనియన్‌తో భారత్‌ సన్నిహితంగా మెలగడమే అందుకు కారణం. బిల్‌ క్లింటన్‌ జమానానుంచి అమెరికా దృక్పథంలో భారత్‌పట్ల ప్రారంభమైన సానుకూల మార్పు- అనంతరం జార్జి బుష్‌, ఒబామాల ఏలుబడిలో కొత్త పుంతలు తొక్కింది. పరస్పర ఆర్థిక ప్రయోజనాలతోపాటు చైనా దుర్భేద్యంగా విస్తరించడమూ అమెరికా, భారత్‌ల మధ్య సాన్నిహిత్యం పెరగడానికి కారణం. అమెరికా తన ఉత్పత్తులను విక్రయించుకోవడానికి భారత్‌ను అద్భుతమైన విపణిగా భావిస్తోంది. పెద్దయెత్తున పెట్టుబడులను దేశంలోకి ఆహ్వానించేందుకు అమెరికా అక్కరకొస్తుందన్నది భారత్‌ ఆలోచన. ప్రాంతీయంగా చైనాకు చెక్‌ పెట్టి, సమతుల్యత సాధనకు ఉపయోగపడే దేశంగా భారత్‌ను అమెరికా పరిగణిస్తోంది. చైనాకు సమాంతరంగా భారత్‌ను మోహరించాలన్న ఆలోచన జార్జి బుష్‌ హయాములో మరింత బలంగా వినిపించింది. అందుకే భారత్‌ అణు కార్యక్రమానికి అడ్డు చెప్పరాదనీ నాటి బుష్‌ ప్రభుత్వం ఒక దశలో భావించింది. ఫలితంగా భారత్‌, అమెరికాల మధ్య సంబంధాలు రెండు అంచెలుగా ముందుకు సాగాయి. ఒకవైపు వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలు; మరోవైపు రక్షణ, భద్రతా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇరు దేశాలూ ప్రస్థానించాయి. ఇరుపక్షాల మధ్య ఏటా 12 వేలకోట్ల డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతోంది.

ఈ పరిమాణాన్ని 50 వేలకోట్ల డాలర్లకు చేర్చాలని రెండు దేశాలూ ఇటీవల లక్ష్యం నిర్దేశించుకున్నాయి. నిజానికి రెండు పక్షాల మధ్య వాణిజ్యంలో భారత్‌కే వాణిజ్య మిగులు ఉంది. అందుకే అప్పుడప్పుడు ఈ విషయాన్ని ట్రంప్‌ వివిధ వేదికలపై ప్రస్తావిస్తుంటారు. అయితే చైనాతో వాణిజ్య లోటు విషయంలో మాత్రం ట్రంప్‌ అత్యంత తీవ్రంగా ప్రతిస్పందిస్తుంటారు. అమెరికా వాణిజ్య లోటు భారత్‌తో పోలిస్తే చైనాతో అత్యధికంగా ఉండటమే ఇందుకు కారణం. మరోవంక డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక దేశాధ్యక్షుడు మాత్రమే కాదు... స్వయంగా అతిపెద్ద వ్యాపార వేత్త. భారత్‌లో ఆయన భారీ పెట్టుబడులు పెట్టారు. అందుకే ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు, మేధా సంపత్తి హక్కులు వంటి కొన్ని అంశాలను మినహాయిస్తే ఇరు దేశాల మధ్య వాణిజ్యానుబంధం చెప్పుకోదగిన విధంగానే ఉంది. పాలు, కోళ్ల విపణిని అమెరికా దిగుమతులకోసం బార్లా తెరవాలని ట్రంప్‌ భారత్‌ను కోరుతున్నారు. తద్వారా అమెరికా కంపెనీల అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి. అమెరికన్లు సాధారణంగా కోడి కాళ్లను ఆరగించేందుకు ఇష్టపడరు. ఫలితంగా అమెరికా పౌల్ట్రీలో కోడి కాళ్లు టన్నులకొద్దీ పేరుకుపోతున్నాయి. వాటన్నింటినీ భారత్‌కు ఎగుమతి చేసి మార్కెట్‌ చేసుకోవాలని అమెరికా తహతహలాడుతోంది. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత అవగాహన ముఖ్యంగా ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో సహకారానుబంధం బలపడితే ఆ కోణంలోనూ వాణిజ్య పరిమాణం ఇబ్బడిముబ్బడి కాగలదనడంలో మరోమాట లేదు.

పసిఫిక్‌ ప్రాంతంలో రక్షణ సహకారంపై జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలిపి అమెరికా ఏర్పాటు చేసిన ‘చతుర్భుజి’లో భారత్‌ అంతర్భాగంగా ఉంది. మరే ఇతర దేశంతో పోల్చినా భారత్‌ ఇప్పుడు అమెరికాతోనే అత్యధికంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. 2016లోనే భారత్‌ను తన ప్రధాన రక్షణ భాగస్వామిగా అమెరికా గుర్తించింది. దాని ప్రకారం ఇరు దేశాలు తమ సైనిక స్థావరాలను యుద్ధ విమానాలు, నౌకల్లో చమురు నింపుకోవడానికి; వాహనాల మరమ్మతు అవసరాలకు వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఆసియాలో భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని, అమెరికన్‌ విదేశాంగ విధానంలో హిందూ మహాసముద్రానికి విస్తరిస్తున్న పాత్రను దృష్టిలో పెట్టుకొని అగ్రరాజ్యం ఇటీవల హవాయ్‌ స్థావరంగా కొనసాగుతున్న పసిఫిక్‌ కమాండ్‌ పేరును యూఎస్‌-ఇండో పసిఫిక్‌ కమాండ్‌గా మార్చింది. రక్షణ బలగాలు, అత్యాధునిక ఆయుధ సంపత్తి విషయంలో భారత్‌, చైనాల మధ్య పెద్ద అగాధమే ఉంది. దీన్ని పూడ్చుకోవడంకోసం గడచిన పదిహేనేళ్లుగా భారత్‌ భారీగా ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. తాజా లెక్కల ప్రకారం, 2007 తరవాత అమెరికానుంచి భారత్‌ చేసిన రక్షణ కొనుగోళ్లు 1,700 కోట్ల డాలర్లకు చేరాయి. కొంతకాలంగా రష్యానుంచి రక్షణ కొనుగోళ్లను తగ్గిస్తున్న భారత్‌- అమెరికానుంచి దిగుమతులను మాత్రం భారీగా పెంచింది.

వ్యూహాత్మక గమనం కీలకం

కశ్మీర్‌ అంశంపై అమెరికా అధ్యక్షుడు వివిధ వేదికలపై వివిధ రకాలుగా స్పందించి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. అది పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని భారత్‌ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తున్నా- మధ్యవర్తిత్వానికి సిద్ధమని అత్యుత్సాహం ప్రదర్శించారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన 370 అధికరణ రద్దు అంశాన్ని ‘సమితి’ భద్రతా మండలిలో చర్చకు పెట్టేందుకు పాకిస్థాన్‌ అన్ని ప్రయత్నాలూ చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ పట్ల అమెరికా కొంతమేర సానుకూల ధోరణితోనే వ్యవహరించింది. ట్రంప్‌తో సమావేశంలో ఒకవేళ కశ్మీర్‌ ప్రస్తావన వస్తే నిర్మొహమాటంగా మన దృక్పథాన్ని మరోసారి కుండ బద్దలుకొట్టాల్సి ఉంది. ఇండో పసిఫిక్‌లో, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో- భారత్‌, అమెరికాల మధ్య నెలకొన్న పరస్పర విరుద్ధ ప్రయోజనాలు సమస్యలకు కారణమవుతున్నాయి. అఫ్గాన్‌లో వ్యూహాత్మక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పాకిస్థాన్‌కు అమెరికా ఆర్థిక సాయం కొనసాగిస్తోంది. పాక్‌పట్ల అమెరికా అనుసరిస్తున్న ఉదార వైఖరి భారత్‌కు తీవ్ర అభ్యంతరకరô. మరోవంక ఇరాన్‌తో అమెరికాకు బద్ధవైరం ఉంది. ఇటీవల ఇరాన్‌ కమాండ్‌ ఖాసిమ్‌ సులెమానీని అమెరికా దళాలు మట్టుపెట్టడం, ఆ తరవాత ఇరాన్‌ ప్రతీకార చర్యలకు దిగడం వంటివి పశ్చిమాసియా సమీకరణలను మార్చేశాయి. ఇరాన్‌తో శతాబ్దాల స్నేహాన్ని పెనవేసుకున్న భారత్‌ ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువైపూ మొగ్గకుండా సమతూకం పాటించాల్సిన అవసరం ఉంది. బలమైన ఆర్థిక వ్యవస్థ, క్రియాశీల ప్రజాస్వామ్యం పునాదిగా ఆసియాలో భారత్‌ ఇప్పుడు కీలక పాత్రధారిగా ఆవిర్భవించింది. కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు అమెరికా ఎంత అవసరమో, అమెరికాకూ భారత్‌ అంతే ముఖ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతర్జాతీయ భౌగోళిక వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా ఇరు దేశాలూ పరస్పర విశ్వాసంతో ముందడుగు వేయాలి. వాస్తవిక ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని అడుగులు కదపాలి. డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తే అది భారత్‌కే కాకుండా అంతర్జాతీయ సమాజానికీ శుభసూచకమే!

ఆచితూచి స్పందించాల్సిందే!

వాణిజ్యం, సుంకాల విషయంలో భారత్‌, అమెరికాల మధ్య కొంతకాలంగా భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. అమెరికా ఉత్పత్తులపై భారత్‌ దిమ్మతిరిగిపోయేలా సుంకాలు వేస్తోందని, వాటిని తగ్గించాలని ఆ దేశం డిమాండ్‌ చేస్తోంది. అమెరికా ఉత్పత్తుల సులభ ప్రవేశానికి వీలు కల్పిస్తూ సుంకాలు తగ్గిస్తే- భారత్‌లో సంబంధిత రంగాలు ప్రతికూలంగా ప్రభావితమవుతాయి. దేశీయ ఉత్పత్తిదారులు, విపణి భారీగా దెబ్బతినక తప్పదు. ఆ ప్రభావం దేశంలో ఉపాధిపైన, ఆయా రంగాల్లో ఉత్పాదకతపైన పడుతుంది. దేశీయ పాలన, పౌల్ట్రీ రంగంలోకి కాలుమోపాలన్న అమెరికా ప్రయత్నాలపట్లా భారత్‌ ఆచితూచి స్పందించాల్సి ఉంది. అమెరికాలో డెయిరీ పరిశ్రమకు అక్కడి ప్రభుత్వం పెద్దయెత్తున రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. పైపెచ్చు అక్కడ పాల పరిశ్రమ దాదాపుగా యంత్ర ఆధారితంగానే పనిచేస్తోంది. ప్రపంచ మార్కెట్లలోకి తక్కువ రేట్లు, ఎక్కువ నాణ్యతతో అమెరికా డెయిరీ ఉత్పత్తులు దూసుకువెళ్ళగల స్థాయిలో ఉన్నాయి. భారత్‌ పరిస్థితి ఇందుకు భిన్నం. ఈ రంగంలో ప్రభుత్వ సబ్సిడీలు, యంత్రాల వినియోగం చెప్పుకోదగిన స్థాయిలో లేవు. కాబట్టి అమెరికా ఉద్ధృతిని మన డెయిరీ పరిశ్రమ తట్టుకోలేదు. ఒకవేళ ఒత్తిడికి తలొగ్గి తలుపులు బార్లా తెరిస్తే అది దేశీయ రైతుల జీవికను దెబ్బకొడుతుందని గుర్తించాల్సి ఉంది. కాబట్టి, ట్రంప్‌తో కుదుర్చుకునే ఏ ఒప్పందమైనా అమెరికాకు కేవలం వ్యాపార అవసరం మాత్రమేనని; భారత్‌కు మాత్రం అది కోట్లాది ప్రజల జీవికను బతుకు తెరువును ప్రభావితం చేసే అంశమని గుర్తుంచుకోవాలి.

డాక్టర్​ మహేంద్రబాబు కురువ

రచయిత- హెచ్​ఎన్​బీ గఢ్వాల్​ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్​ డీన్​

Last Updated : Mar 2, 2020, 6:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.