ETV Bharat / bharat

'ట్రంప్ పర్యటన... స్నేహగీతంలో ఓ సరికొత్త రాగం' - మోదీ నమస్తే ట్రంప్

అమెరికా భారత్​ మధ్య భాగస్వామ్యం మాత్రమే కాదని.. అంతకుమించిన సన్నిహిత సంబంధం ఉందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. భారత్​లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సరికొత్త అధ్యాయమని పేర్కొన్నారు ప్రధాని. 21 శతాబ్దంలో ప్రపంచానికి భారత్​-అమెరికా మార్గనిర్దేశం చేస్తాయని అన్నారు.

modi, trump
మోదీ ట్రంప్​
author img

By

Published : Feb 24, 2020, 5:54 PM IST

Updated : Mar 2, 2020, 10:32 AM IST

'ట్రంప్ పర్యటన... స్నేహగీతంలో ఓ సరికొత్త రాగం'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను ప్రశంసల్లో ముంచెత్తారు ప్రధాని నరేంద్రమోదీ. ట్రంప్ భారత పర్యటనను రెండు దేశాల మధ్య సంబంధాల్లో సరికొత్త అధ్యాయంగా అభివర్ణించారు. అమెరికాతో భారత్​ బంధం మరింత దృఢమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

హౌడీ మోదీతో ప్రారంభం..

అహ్మదాబాద్​ మోటేరా మైదానంలో నిర్వహించిన 'నమస్తే ట్రంప్​' కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడిని సాదరంగా ఆహ్వానించారు మోదీ. ఈ సందర్భంగా ట్రంప్​తోపాటు అమెరికాతో సంబంధాలపై మోదీ ప్రసంగించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్​ వచ్చిన ట్రంప్ కుటుంబ సభ్యులనూ పేరుపేరున ప్రస్తావించారు.

"ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మీకు స్వాగతం పలుకుతోంది. 5 నెలల క్రితం అమెరికా పర్యటనలో భాగంగా హ్యూస్టన్​లో హౌడీ మోదీ కార్యక్రమంతో మా ప్రయాణం ప్రారంభమైంది. ప్రస్తుతం ట్రంప్​ మొదటి భారత్​ పర్యటన అహ్మదాబాద్​లో నమస్తే ట్రంప్​తో ప్రారంభమైంది.

ఇవాంకా ట్రంప్​ రెండేళ్ల క్రితం భారత్​ వచ్చారు. అప్పుడు మరోసారి భారత్​కు రావాలని ఉందన్నారు. ఇప్పుడు మీరు రావటం మాకెంతో సంతోషంగా ఉంది. "

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ట్రంప్​ పర్యటనతో రెండు దేశాల మధ్య సరికొత్త చరిత్రకు నాంది పలికారని మోదీ పేర్కొన్నారు. ఇది రెండు దేశాల మధ్య ఒప్పందాలు, అవకాశాలు, మార్పులు తీసుకొస్తుందని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య నమ్మకమే ప్రధాన బలమనీ.. కొన్నేళ్లుగా ఇద్దరి బంధం చారిత్రక స్థాయికి చేరుకుందని అన్నారు.

సంబంధాలు మరింత బలోపేతం

21వ శతాబ్దంలో రెండు దేశాల మైత్రి కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు మోదీ. భారత్​-అమెరికా సహజమైన భాగస్వాములని ఉద్ఘాటించారు. ఉగ్రవాదంపై అమెరికా నిబద్ధతగా వ్యవహరించిందని కితాబిచ్చారు ప్రధాని.

"ట్రంప్​ చాలా గొప్పగా ఆలోచిస్తారు. అమెరికన్ల​ కలను సాకారం చేసేందుకు ఆయన చేసిన కృషి ప్రపంచమంతా తెలుసు. అధ్యక్షుడు ట్రంప్​ నాయకత్వంలో భారత్​-అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ట్రంప్​ పర్యటన రెండు దేశాల మధ్య సరికొత్త అధ్యాయం. దీనివల్ల రెండు దేశాల ప్రజలకు అభివృద్ధి, సామసర్యం పెరుగుతుంది."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

వివిధ రంగాల్లో భారత్‌ సాధించిన ఘనతలను ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. 130 కోట్ల ప్రజలు కలిసి సరికొత్త భారత్​ను నిర్మించారని ప్రశంసించారు. ఒకేసారి ఎక్కువ ఉపగ్రహాలను నింగిలోకి పంపి భారత్‌ ప్రపంచ రికార్డు సృష్టించిందన్నారు ప్రధాని.

ఇదీ చూడండి: 'తీవ్రవాదంపై ఉక్కుపాదం.. భారత్​తో స్నేహగీతం'

Last Updated : Mar 2, 2020, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.