ETV Bharat / bharat

వారిని ప్రసన్నం చేసుకునేందుకే 'ఓటు'చాటు పర్యటన?

మీరు మా దేశ సంస్కృతిని సమున్నతం చేశారు. మా విలువల్ని పాటించారు. మా సామాజిక సముదాయాల్ని మరింత బలోపేతం చేశారు’’ గత ఏడాది ‘హౌడీ మోదీ’ సభలో ప్రవాస భారతీయులను పొగుడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలివి. ఈ పొగడ్తల పరమార్థం ఏమిటి?

trump india visit to attract NRI voters?
వారిని ప్రసన్నం చేసుకునేందుకే ఓటుచాటు పర్యటన?
author img

By

Published : Feb 24, 2020, 7:42 AM IST

Updated : Mar 2, 2020, 8:58 AM IST

అమెరికా అధ్యక్షుడు భారత పర్యటనకు వస్తున్నారంటే... ఆర్థిక, ఆయుధ, అంతర్జాతీయ సంబంధాలపై ఒప్పందాలు ఉంటాయని అనుకుంటాం. కానీ ఈసారి ‘అంతకుమించిన’ ప్రయోజనాల్ని ఆశించి డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనకు వస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. వచ్చే నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ పోటీచేయబోతున్నారు. అమెరికాలో ప్రవాస భారతీయ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. వీరి మద్దతును కూడగట్టే లక్ష్యం ఈ పర్యటనలో దాగుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ అమెరికాలో ఎందరు ప్రవాస భారతీయ ఓటర్లున్నారు? వీరి మద్దతు ట్రంప్‌కు ఎందుకు అవసరం? అనేవి ఆసక్తికర విషయాలు.

1957లో భారతీయుడి తొలి విజయం

పంజాబ్‌కు చెందిన దిలీప్‌సింగ్‌ సౌద్‌ 1957లో అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ప్రవాస భారతీయుడు. రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు ఇద్దరికీ ఎన్నికల నిధులను సమకూర్చడంలో ప్రవాస భారతీయులు ముందుంటున్నారు. వీరి ప్రభావాన్ని గుర్తించిన ట్రంప్‌ 2016 ఎన్నికల్లో గెలిచిన తర్వాత భారతీయ మూలాలున్న నిక్కీ హెలీని ఐక్యరాజ్యసమితిలో శాశ్వత ప్రతినిధిగా నియమించారు. ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌కు అజిత్‌పాయ్‌ని అధ్యక్షుణ్ని చేశారు. ఆరోగ్య సేవల విభాగానికి సీమా వర్మను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించారు.

డెమోక్రాట్ల వైపే మొగ్గు?

భారతీయ అమెరికన్లు డెమోక్రాట్లకే మద్దతు ఇచ్చినట్లు 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు, ఆ తర్వాత నిర్వహించిన సర్వేలు నిగ్గుతేల్చాయి. వీరి సంఖ్య అధికంగా ఉన్న 16 రాష్ట్రాల్లో పరిశీలించగా.. 10 చోట్ల డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌(57.6%)కు, ఆరుచోట్ల రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌(29.3%)కు మద్దతిచ్చారని తేలింది.

భయపెడుతున్న స్వల్ప మెజారిటీలు

ఈసారి పెన్సిల్వేనియా, మిషిగాన్‌, విస్కాన్‌సిన్‌, ఫ్లోరిడాలలో నమోదయ్యే ఓటింగ్‌ అమెరికా అధ్యక్షుణ్ని నిర్ణయిస్తుందనేది విశ్లేషకుల అంచనా. ఎందుకంటే... 2016 ఎన్నికల్లో ట్రంప్‌ ఒక్కో రాష్ట్రంలో 10-11 వేల మధ్య ఆధిక్యం సాధించారు. ఏకంగా 50 రాష్ట్రాలున్న అమెరికాలో ఈ లెక్కలు తారుమారైతే తుది ఫలితాలు ప్రభావితం అవుతాయి. అందుకే మెజారిటీని పెంచుకునేందుకు రిపబ్లికన్లు పక్కాగా వ్యూహాలు పన్నుతున్నారని, అందులో భాగంగానే ప్రవాస భారతీయులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి భారతీయ అమెరికన్లు దాదాపు 6.5 లక్షల మంది ఉంటారని అంచనా. వీరిలో గుజరాతీయులు అధికంగా ఉన్నారు. ఈ ఓటర్లను దృష్టిలో ఉంచుకునే ట్రంప్‌ భారత పర్యటనకు మరీ ముఖ్యంగా గుజరాత్‌కు వస్తున్నారనేది పరిశీలకుల అంచనా.

అసంతృప్తిని చల్లార్చే యత్నం

అధ్యక్షుడయ్యాక ట్రంప్‌ అమెరికా వలస విధానాలను అత్యంత కఠినం చేశారు. వీసాల జారీని బాగా తగ్గించారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలపై సంతోషంగా లేరు. ఈ చర్యలతో ప్రవాస భారతీయులు ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మోదీని ప్రభావితం చేస్తే... ఆయనకున్న ప్రజాదరణతో ప్రవాస భారతీయులూ సంతసిస్తారని రిపబ్లికన్ల అంచనాగా తెలుస్తోంది. హౌడీ-మోదీ సభలో ‘అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌’(మరోసారి ట్రంప్‌ ప్రభుత్వం) అంటూ నరేంద్రమోదీ ప్రకటించడం వారి అంచనాలకు బలం చేకూరుస్తోంది.

మన వాళ్లు 40 లక్షల మంది!

trump-india-visit-to-attract-nri-voters
వారిని ప్రసన్నం చేసుకునేందుకే ఓటుచాటు పర్యటన?

చదువు, ఉపాధి అవకాశాలు, వ్యాపారం, వివిధ వృత్తుల కోసం అనేక మంది భారతీయులు అమెరికాకు వెళుతున్నారు. 2010-17 మధ్య భారతీయుల వలసలు 50% పెరిగాయి. ఇలా వెళ్లి అక్కడే స్థిరపడిన వారిలో చాలా మందికి ఓటు హక్కు లభించింది.

అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే-2017 ప్రకారం అమెరికా జనాభా 33 కోట్లు.

వారిలో ఏకంగా 4.4 కోట్ల మంది వివిధ దేశాల నుంచి వచ్చి స్థిరపడిన ప్రవాసులు.

వీరిలో భారతీయులు దాదాపు 40 లక్షల మంది(ఇది ప్రవాసుల్లో 5.9% కాగా... మొత్తం అమెరికా జనాభాలో 1.3%)

అమెరికాలో 50 రాష్ట్రాలుంటే.. వాటిలోని 16 రాష్ట్రాల్లో 1% కంటే ఎక్కువగా ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు.

ఇదీ చూడండి: నమస్తే ట్రంప్​: 36 గంటల్లో డొనాల్డ్ చేసే పనులివే...

Last Updated : Mar 2, 2020, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.