అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న తరుణంలో భారత్‌పై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఎన్నోసార్లు భారత్‌ను సుంకాల రారాజుగా అభివర్ణించిన ఆయన... మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ఆరోపించారు.
"వచ్చే వారం నేను భారత్‌కు వెళ్తున్నా. వాణిజ్య చర్చలు జరుపుతాం. ఎన్నో ఏళ్లుగా అమెరికాపై భారత్ భారీస్థాయిలో సుంకాలు విధిస్తోంది. నాకు ప్రధాని మోదీ నిజంగా ఎంతో ఇష్టం. కాకపోతే మామధ్య కొన్ని వాణిజ్య చర్చలు జరగాల్సివుంది. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి."
--- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
ట్రంప్ పర్యటనలో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశముందన్న ఉహాగానాల నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు ఆందోళన కలిగించే అంశం. అమెరికాకు లాభం జరిగే విధంగా ఉంటేనే వాణిజ్య ఒప్పందం చర్చలు సాఫీగా సాగుతాయని ఇప్పటికే తేల్చిచెప్పారు.
ఇదీ చూడండి- భారత్‌తో బ్రహ్మాండమైన వాణిజ్య ఒప్పందం: ట్రంప్