కశ్మీర్ లోయలో 28వేల మంది భద్రతా సిబ్బంది మోహరింపుపై కేంద్ర హోంశాఖ స్పందించింది. భద్రతా కారణాలతోనే ఈ మేరకు సైన్యానికి ఆదేశాలిచ్చినట్లు పేర్కొంది.
జమ్ముకశ్మీర్‌కు సంబంధించి కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుందని... ఎన్నికలకు సన్నద్ధమయ్యే దిశగానే బలగాల ప్రక్రియ చేపడుతున్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బలగాల తరలింపుపై వివరణ ఇచ్చింది కేంద్ర హోంశాఖ. అంతర్గత భద్రతా కారణాలతోనే ఈ ప్రక్రియ చేపట్టామని, బహిరంగంగా వివరాలు వెల్లడించలేమని స్పష్టం చేసింది.
వారం కిందటే బలగాల తరలింపునకు ఆదేశాలిచ్చామని, వారు నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాయి హోంశాఖ వర్గాలు.
" అంతర్గత భద్రతా పరిస్థితి, శిక్షణా అవసరాలను గుర్తించి బలగాల తరలింపు చేపట్టాం. జవాన్ల ఉపసంహరణ, నూతన బృందాలను చేర్చే ప్రక్రియ నిరంతరం జరిగేదే."
-హోంశాఖ వర్గాలు
ఇదీ చూడండి: రవీష్ కుమార్‌కు 'రామన్ మెగసెసె' అవార్డు