కేరళలోని త్రివేండ్రంలో అంత్యక్రియలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ఏర్పాటు చేస్తోంది అక్కడి యంత్రాంగం. ప్రజా శ్మశానవాటిక శాంతికవాడం నుంచి ఈ సేవలు కల్పించనుంది. కరోనా నేపథ్యంలో అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు.. కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.
ఇలా వీక్షించవచ్చు..
ఈ సేవలకు సంబంధించి ఆన్లైన్ స్ట్రీమింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశారు అధికారులు. అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారాలను.. డైరెక్టర్ ఆఫ్ స్మార్ట్ త్రివేండ్రం వెబ్ పేజీ, శాంతికవాడం యూట్యూబ్ ఛానెల్, ఫేస్బుక్ పేజీల ద్వారా వీక్షించవచ్చు. సంబంధిత దృశ్యాలు, ఖననమయ్యే వ్యక్తి పేరు శాంతికవాడం గేట్ ముందు ప్రదర్శిస్తారట. అంతేకాకుండా.. దహన ధ్రువీకరణ పత్రం (క్రిమేషన్ సర్టిఫికెట్)ను ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంచుతారట.
రాష్ట్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించి ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 381 మందికి శాంతికవాడంలో అంత్యక్రియలు జరిగాయి.
ఇదీ చదవండి: నేపాలీయుల కోసం.. భారత్లో ఆ బ్రిడ్జ్ పునఃప్రారంభం