ETV Bharat / bharat

'హిందూ పాకిస్థాన్​'.. ఇదే భాజపా లక్ష్యం - Congress leader shashi Tharoor

కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు శశిథరూర్ కొత్తగా రాసిన 'బ్యాటిల్​ ఆఫ్​ బిలాంగింగ్​' పుస్తకం శనివారం విడుదలైంది. ఇందులో భారత్​ను 'హిందూ పాకిస్థాన్​'గా మార్చడమే భాజపా భావజాల సారాంశమని థరూర్​ అభిప్రాయపడ్డారు.

Triumph of Hindutva movement would mark end of 'Indian idea': Tharoor
'హందూ పాకిస్థాన్​'.. ఇదే భాజపా లక్ష్యం
author img

By

Published : Nov 1, 2020, 11:00 AM IST

భారత్​ను 'హిందూ పాకిస్థాన్​'గా మార్చడమే భాజపా భావజాల సారాంశమని కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు శశిథరూర్​ అభిప్రాయపడ్డారు. ఆయన కొత్తగా రాసిన 'బ్యాటిల్​ ఆఫ్​ బిలాంగింగ్​' పుస్తకం శనివారం విడుదలైంది. ఇందులో ఒక అధ్యాయాన్ని 'హిందూ పాకిస్థాన్​' అనే పేరుతో రాశారు.

"హిందుత్వ ఉద్యమం 1947లో జరిగిన ముస్లిం మతతత్వానికి ప్రతిబింబం లాంటిది. హిందుత్వ అన్న మాటకు మతంతో సంబంధం లేదు. అది రాజకీయ భావన. హిందుత్వ అన్నది రాజకీయ సిద్ధాంతం. 'హిందూ ఇండియా'లో హిందువులకు ప్రమేయం ఉండదు. సంఘ్​ పరివార్​కే ఉంటుంది. అదొక ప్రత్యేకమైన దేశం. భారత్​ మతరాజ్యంగా మారకూడదని నాలాంటి దేశ ప్రేమికులు కోరుకుంటున్నారు. ముస్లిం పాకిస్థాన్​లాగా హిందుత్వ భారత్​ తయారు చేయాలని అధికార పార్టీ భావిస్తోంది. ఇందుకోసం మనం స్వాతంత్ర్య పోరాటం చేయలేదు. ఈ భావజాలం మన రాజ్యాంగంలోనూ లేదు. ఇది భారతీయత అనే మౌలిక భావనకే విరుద్ధం. నాలాంటి గర్వించే హిందువులు భాజపా భావజాలాన్ని అంగీకరించరు. గతంలో భారత భూభాగం విభజన జరిగితే ఇప్పుడు భారత ఆత్మ విభజన జరుగుతోంది" అని థరూర్​ తన పుస్తకంలో వివరించారు.

ఇదీ చూడండి: 'అవును నేను అదే.. ప్రజలే నా యజమానులు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.