ETV Bharat / bharat

యాప్​లో కూరగాయలు అమ్మేస్తున్న గిరిజన 'రైతమ్మలు'!

కరోనా ఎందరో జీవితాల్లో చీకటి నింపిన మాట వాస్తవమే. కానీ, కొందరి బతుకుల్లో మాత్రం కొత్త వెలుగులు తెచ్చింది. అవును, ఒడిశాలో రోజంతా మార్కెట్లో కూర్చుని కూరగాయలు అమ్మలేక, తక్కువ ధరకే దళారులపాలు చేసి చిన్నబోయిన గిరిజన రైతమ్మలకు కరోనా ఓ దారిచూపింది. దళారులు పెంచిన ధరలు పెట్టి కొనలేక సంచులు నిండకుండానే ఇంటికెళ్లిపోయిన వినియోగదారులు... 'గ్రీన్ లైన్​'లో ఆర్టర్ చేస్తే ఇంటి వద్దకే తాజా కూరగాయలు వచ్చేలా చేసింది. అదెలా సాధ్యపడిందో మీరే ఓ లుక్కేయండి...

author img

By

Published : Sep 26, 2020, 11:16 AM IST

tribal-women-farmers-use-mobile-app-to-home-deliver-vegetables
యాప్ లో కూరగాయలు అమ్మేస్తున్న గిరిజన 'రైతమ్మలు'!

ఒడిశాలో యాప్ ద్వారా కూరగాయలు విక్రయిస్తూ.. లాభాలు ఆర్జిస్తున్నారు గిరిజన మహిళా రైతులు.

యాప్​లో కూరగాయలు అమ్మేస్తున్న గిరిజన 'రైతమ్మలు'!

లాక్​డౌన్ వేళ కోరపుట్ జిల్లాలో గిరిజన మహిళలు సాగు చేసిన కూరగాయలను మార్కెట్​కు తరలించడం కష్టంగా మారింది. అటు నగరాలు, పట్టణాల్లో కూరగాయలు దొరక్క ప్రజలు ఇబ్బందిపడ్డారు. అదే సమయంలో గలెగుడాకు చెందిన 'జయదుర్గా ప్రొడ్యూసర్స్ గ్రూప్' అనే గిరిజన మహిళా బృందానికి ఓ బాధ్యత అప్పజెప్పింది ఒడిశా గ్రామీణాభివృద్ధి మార్కెటింగ్ సంఘం. కంటెయిన్మెంట్ జోన్లలో.. కూరగాయలు విక్రయించాలని కోరింది.

గ్రీన్ లైన్స్ యాప్

మహిళా బృందం వారి బాధ్యతను నిర్వర్తించడానికి సఖా ఫౌండేషన్ అనే ఎన్​జీఓ సహకారం కోరింది. రైతులు అడిగిందే ఆలస్యం రైతులకు, వినియోగదారులు సులభంగా ఉపయోగించగలిగే 'గ్రీన్ లైన్' మొబైల్ యాప్​ను రూపొందించింది సఖా ఫౌండేషన్.

సులభమైన మార్గం...

ఈ 'గ్రీన్ లైన్' మొబైల్ యాప్​ను వాట్సాప్ నుంచి వినియోగించుకునేలా రూపొందించారు. కూరగాయల ధరలు, ఇతర నిత్యావసర వస్తువుల వివరాలు ఈ యాప్​లో ఉంటాయి. హోం డెలివరీ సదుపాయమూ కల్పించారు. దీంతో వినియోగదారులు ఇంట్లో కూర్చుని ఆర్డర్ చేస్తే తాజా కూరగాయలు వారి గుమ్మం వద్దకే చేరుతాయంటుున్నారు సఖా ఫౌండేషన్ డైరెక్టర్ జయంతి పద్మన్.

కంటెయిన్మెంట్ జోన్లలో కూరగాయలు సరఫరా చేసేందుకు మొదలైన ఈ వ్యాపారం ... లాక్​డౌన్ నిబంధనలు ఎత్తివేశాక కూడా దిగ్విజయంగా కొనసాగుతోంది. గ్రీన్ లైన్​కు అలవాటుపడిన వినియోగదారుల ఇప్పటికీ ఆర్డర్లు పెడుతున్నారని, దీంతో మహిళా రైతులు లాభపడుతున్నారని తెలిపారు ఒడిశా గ్రామీణాభివృద్ధి మార్కెటింగ్ సంఘం జిల్లా అధికారి.

ఇదీ చదవండి: డ్యూటీ కోసం ఇద్దరు మహిళల సాహసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.