ETV Bharat / bharat

'దేశంలోకి వైరస్​ను ఎక్కువగా మోసుకొచ్చిందే వారే' - ప్రయాణికులు

ఆరు నెలలుగా ముప్పుతిప్పలు పెడుతోన్న కరోనా.. అన్ని దేశాలను అతలాకుతలం చేసింది. ప్రపంచమే కుగ్రామంగా మారిన వేళ వేగంగా విస్తరించిందీ మహమ్మారి. అయితే, భారత్​లోకి దుబాయ్​, బ్రిటన్​ నుంచి వచ్చిన ప్రయాణికులే ​అత్యధికంగా కరోనాను మోసుకొచ్చారని చెబుతోంది ఓ ఐఐటీ అధ్యయనం.

COVID-19
ప్రయాణికుల వల్లే వ్యాప్తి
author img

By

Published : Sep 27, 2020, 4:37 PM IST

తొలినాళ్లలో దేశంలోకి కరోనా వైరస్​.. అత్యధికంగా దుబాయ్​, యూకే ప్రయాణికుల నుంచే వచ్చినట్లు ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజి.. ఐఐటీ-మండి అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధన ప్రకారం దేశంలో కొవిడ్​-19 వ్యాప్తి ఎక్కువగా అంతర్జాతీయ ప్రయాణికుల వల్లే అయినట్లు తెలుస్తోంది.

తమిళనాడు, దిల్లీ, ఆంధ్రప్రదేశ్​లో సామాజిక వ్యాప్తి జరగకుండా కొద్దిమేరకు అడ్డుకున్నారని.. అదే సమయంలో గుజరాత్​, రాజస్థాన్​, మహారాష్ట్ర, కేరళ, జమ్ముకశ్మీర్​, కర్ణాటకలోని కరోనా బాధితులు స్థానికంగా ప్రబలటానికి, అంతర్రాష్ట్ర వ్యాప్తికి కారణమయ్యారని ఈ అధ్యయనం తేల్చింది.

IIT study
ఐఐటీ-మండి అధ్యయనం

జనవరి-ఏప్రిల్​ మధ్య దేశానికి వచ్చిన కరోనా బాధితుల ట్రావెల్ హిస్టరీ ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టారు. వైరస్​ వ్యాపించిన మొదట్లో వచ్చిన ప్రాథమిక డేటా విశ్లేషించి ఐఐటీ మండి ఈ పరిశోధన నిర్వహించింది. ఇందులో అత్యధికంగా దుబాయ్​, యూకే నుంచే అత్యధిక కేసులు వచ్చినట్లు గుర్తించారు.

మేము కొవిడ్-19 వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది ? దేశంలో ఎలా జరిగింది ? అనే అంశాలను నిశితంగా పరిశీలించాం. కొంతమంది సూపర్​ స్ర్పెడర్లు వైరస్​ వ్యాప్తిలో కీలకంగా నిలిచారు. ఫేజ్​-1లో అంతర్జాతీయ ప్రయాణికుల ద్వారా ఎలా ప్రబలిందనే అంశం ట్రావెల్​ హిస్టరీ ఆధారంగా తెలుసుకున్నాం. వారి నుంచే స్థానికులకు ఎక్కువగా వైరస్​ సోకింది.

-సరితా ఆజాద్​, అసిస్టెంట్​ ప్రొఫెసర్​, ఐఐటీ మండి

తమ విశ్లేషణల ఆధారంగా.. దుబాయ్, యూకే ప్రయాణికుల ప్రైమరీ కాంటాక్టులకు వైరస్​ సోకిందని, ఆ తర్వాత చాలా చోట్ల ఇది సామూహిక వ్యాప్తికి దారి తీసిందని అధ్యనయం చేసిన పరిశోధకులు చెబుతున్నారు.

విభిన్న వర్గాలను తీసుకుని కొన్ని క్లస్టర్లుగా విభజించాం. వివిధ రాష్ట్రాల్లోని డేటా ఆధారంగా ఒక నెట్​వర్క్​ నిర్మించాం. అది మాకు విశ్లేషణకు పనికొచ్చింది. మొదటి దశలో తమిళనాడు, దిల్లీ, ఏపీలో లాక్​డౌన్ సమయంలోనే భారీగా కేసులు వచ్చాయి. మార్చి 25 నుంచి ఏప్రిల్​ 14 మధ్యే ఇవి నమోదయ్యాయి.

ఈ తరహా అధ్యయనాలు భవిష్యత్తులో విపత్తులు ఎదుర్కొనేందుకు తొడ్పడతాయనే ఆలోచనతో.. ఐఐటీ మండి అసిస్టెంట్​ ప్రొఫెసర్​ సరిత, విద్యార్థి సుష్మా దేవితో కలిసి ఈ పరిశోధన చేపట్టారు. రియల్​ టైం డేటాను ప్రామాణికంగా తీసుకుని ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రాథమిక దశలో వైరస్​ వ్యాపించిన విధానాన్ని క్షుణ్నంగా పరిశీలించి ఫలితాలు వెలువరించారు.

ఇదీ చూడండి: దేశంలో కొత్తగా 88,599‬ కేసులు, 1124 మరణాలు

ఇదీ చూడండి: భారతీయ వ్యాక్సిన్​పై మోదీ భరోసా.. డబ్ల్యూహెచ్​ఓ ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.