ETV Bharat / bharat

హద్దులు మాయం- 15 ట్రాన్స్​జెండర్​ జంటల వివాహం - పెళ్లి

ఛత్తీస్​గఢ్​ రాజధాని రాయ్​పూర్​లో సామాజిక హద్దులను చెరిపేశారు ట్రాన్స్​జెండర్లు. ఒకరినొకరు ఇష్టపడిన 15 జంటలు ఏకమయ్యాయి. ఇలాంటి వివాహాలు జరగటం దేశంలో ఇదే తొలిసారి అంటూ గర్వంగా చెబుతున్నారు ఈ ట్రాన్స్​జెండర్ ప్రేమికులు.

ట్రాన్స్​జెండర్​
author img

By

Published : Mar 31, 2019, 3:37 PM IST

సామూహిక ట్రాన్స్​జెండర్ల వివాహం
ఎనిమిదేళ్ల క్రితం మహారాష్ట్ర నాగ్​పూర్​లోని గులాం నబీ అన్సారీతో ప్రేమలో పడింది ట్రాన్స్​జెండర్​ సలోని. వారి కుటుంబాలు మాత్రం పెళ్లికి నిరాకరించాయి. వారి బంధాన్ని చూసి ఇతరులు అపహాస్యం చేశారు. అయినా ఆ జంట ఒకరినొకరు వీడలేదు. సలోని-అన్సారీ జంట తాజాగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది.

ఛత్తీస్​గఢ్​ రాయ్​పూర్​లో ట్రాన్స్​జెండర్ల సామూహిక వివాహాలు ఆదివారం జరిగాయి. ఇందులో 15 జంటలు సామాజిక హద్దులను చెరిపేసి ఒక్కటై తమకూ సాధారణంగా జీవించే హక్కు ఉందని చాటి చెప్పారు.

2014లో ట్రాన్స్​జెండర్లను మూడో లింగమని గుర్తింపునిస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. వారికి అన్ని హక్కులు ఉండాలని తేల్చిచెప్పింది. సుప్రీం తీర్పును పూర్తిస్థాయిలో ఆచరణలోకి తెచ్చేందుకు ట్రాన్స్​జెండర్ల సామాజిక కార్యకర్త విద్యా రాజ్​పుత్​ నడుం బిగించారు.

తన ప్రయత్నంలో భాగంగా ట్రాన్స్​జెండర్లకు పెళ్లిళ్లు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు విద్యా రాజ్​పుత్. ఈ కార్యక్రమానికి 15 జంటలు ముందుకొచ్చాయి. ఇందులో ఆరు రాష్ట్రాలకు చెందిన ట్రాన్స్​జెండర్లు ఉన్నారు. విద్య కృషి ఫలితంగానే రాయ్​పూర్​ పుజారి పార్క్​ ప్యాలెస్​లో అన్సారీ-సలోనిల కల నిజమైంది.

ఇదీ చూడండి:విదేశాలకు ఆదివాసీల 'విప్పపువ్వు సారా'

AP Video Delivery Log - 0800 GMT News
Sunday, 31 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0733: Ukraine Elections Observers AP Clients Only 4203640
US observers on risk of Russia meddling in vote
AP-APTN-0723: Archive NKorea Spain Attack AP Clients Only 4203638
NKorea calls for investigation into embassy attack
AP-APTN-0648: Ukraine Polls Open 2 AP Clients Only 4203636
Voters on their hopes for presidential elections
AP-APTN-0627: Australia Japan Teenagers No access Australia 4203635
Japanese teenagers found drowned on Fraser Island
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.