ETV Bharat / bharat

'భారత్​ బంద్​'కు కార్మిక సంఘాల​ మద్దతు - ఈ నెల 8న భారత్​ బంద్​

కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ.. ఈ నెల 8న భారత్​ బంద్​కు రైతు సంఘాలిచ్చిన పిలుపునకు మద్దతు పలికాయి కార్మిక సంఘాలు. రైతుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపాయి.

Trade unions lend support to 'Bharat Bandh' call by farmers on Dec 8
రైతన్నల 'భారత్​ బంద్​'కు ట్రేడ్​ యూనియన్ల మద్దతు
author img

By

Published : Dec 5, 2020, 7:05 PM IST

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతు సంఘాలు డిసెంబర్‌ 8న(మంగళవారం) తలపెట్టిన ‘భారత్‌ బంద్‌’కు ట్రేడ్‌ యూనియన్లు మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు పది ట్రేడ్‌ యూనియన్ల ఐక్యవేదిక.. రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించింది. కొత్తగా తీసుకొచ్చిన కార్మిక చట్టాలు, వ్యవసాయ చట్టాలు, ఇతర అంశాలపై గత నెల 26న కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె చేపట్టాయి. తాజాగా రైతులు తలపెట్టిన బంద్‌కు తమ మద్దతు ప్రకటించాయి కార్మిక సంఘాలు.

ఆ పది యూనియన్లు ఇవే..

భారత్‌ బంద్‌కు మద్దతు తెలిపిన ట్రేడ్‌ యూనియన్లలో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్‌, యూటీయూసీ సంఘాలు ఉన్నాయి.

వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనకు తాము మద్దతు ఇస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది ట్రేడ్​ యూనియన్​ ఐక్యవేదిక. ఈ బంద్‌కు కార్మికులు, ఉద్యోగులు, అనుబంధ సంఘాల సభ్యులు సంఘీభావం తెలియజేయాలని కోరాయి. మరోవైపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. చర్చలు విఫలమైతే భారత్‌ బంద్‌ను ఉద్ధృతం చేయాలని నిర్ణయించాయి.

ఇదీ చదవండి: సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందే- రైతుల పట్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.